F3 Movie Collections: ఓపెనింగ్స్ చూసి ఎఫ్3 భారీ హిట్ కొడుతుదనుంటే అసలుకే ఎసరొచ్చేలా కనిపిస్తుంది. కొత్త చిత్రాల విడుదల నేపథ్యంలో ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అంటున్నారు. మరోవారం సమయం దొరికితే ఎఫ్3 పరిస్థితి వేరేలా ఉండేదన్నమాట వినిపిస్తుంది. 2019 సంక్రాంతి విన్నర్ ఎఫ్2 సూపర్ హిట్. ఆ ఏడాది భారీ లాభాలు పంచి చిత్రంగా ఎఫ్2 రికార్డులకెక్కింది. ఈ జోష్ లో దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ సిద్ధం చేశాడు. సేమ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు భారీ క్యాస్ట్ తీసుకుని చకచకా సినిమా పూర్తి చేశాడు.
అనిల్ రావిపూడి తన టీమ్ తో పాటు విరివిగా ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో ఎఫ్3 చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వీకెండ్ ఘనంగా ముగించిన ఎఫ్3 వీక్ డేస్ లో నెమ్మదించింది. సమ్మర్ హాలిడేస్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేదు. అయితే సెకండ్ వీకెండ్ పుంజుకుంటుంది అనుకుంటే కొత్త చిత్రాలు వచ్చిపడ్డాయి. జూన్ 3న కమల్ హాసన్ విక్రమ్, మహేష్ నిర్మాతగా ఉన్న అడివి శేష్ మేజర్ తో పాటు మరికొన్ని కొత్త చిత్రాలు విడుదలవుతున్నాయి.
Also Read: Ram Boyapati Movie Story: రామ్ – బోయపాటి మూవీ స్టోరీ లైన్ ఇదే
ఈ కారణంగా ఎఫ్3 థియేటర్స్ కోల్పోయే అవకాశం కలదు. దిల్ రాజు నిర్మాత కాబట్టి థియేటర్స్ కేటాయింపు విషయంలో నైజాంలో ఎఫ్3 చిత్రానికే ప్రాధాన్యత ఉంటుంది. ఆంధ్రాలో మాత్రం కష్టం. విడుదలయ్యే కొత్త చిత్రాల టాక్ ఎలా ఉన్నప్పటికీ మరో సోలో వీకెండ్ లభిస్తే ఎఫ్3 చాలా వరకు సేవ్ అయ్యేది. ఎఫ్3 మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ పుంజుకునే అవకాశం లేకుండా పోయింది.
ఇక ఆరు రోజుల్లో ఎఫ్3 కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఏపీ/ తెలంగాణాలలో కలిపి రూ. 37.30 కోట్ల షేర్, రూ. 53.75 గ్రాస్ రాబట్టింది. కర్ణాటక రూ. 2.61 కోట్లు, ఓవర్సీస్ రూ.6.55 కోట్ల వసూళ్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 46.40 కోట్ల షేర్, రూ. 77.35 కోట్ల గ్రాస్ వసూళ్లు ఎఫ్3 సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 64 కోట్లు… కనీసం రూ. 65 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లు. దానికి మరో రూ.19 కోట్ల దూరంలో ఎఫ్3 చిత్రం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎఫ్3 మ్యాజిక్ చేసి, ఆ ఫిగర్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
ఎఫ్3 మూవీలో వెంకీ-వరుణ్ లకు జంటగా తమన్నా, మెహ్రీన్ నటించారు. సోనాల్ చౌహన్ మరో హీరోయిన్ గా నటించిగా సునీల్, రాజేంద్రప్రసాద్ కీలక రోల్స్ చేశారు. ఎఫ్3 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.