Ram Boyapati Movie Story: గత ఏడాది డిసెంబర్ నెలలో నందమూరి బాలకృష్ణ తో బోయపాటి శ్రీను తీసిన అఖండ సినిమా విడుదల అయ్యి ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వినయ విధేయ రామ వంటి ఫ్లాప్ తో డీలా పడిన బోయపాటి శ్రీను కి అఖండ సినిమా ద్వారా భారీ విజయం దక్కింది..ఈ సినిమాతో మాస్ సినిమాలు తియ్యడం తనకి తానె సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు బోయపాటి శ్రీను..ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ఎవరితో చేస్తాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో హీరో రామ్ పోతినేని తో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు..బోయపాటి శ్రీను ఇప్పటి వరుకు అల్లు అర్జున్ తో మినహా, మిగిలిన యువ హీరోలతో చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి..ముఖ్యంగా నేటి తరం మాస్ హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారితో ఆయన చేసిన దమ్ము మరియు వినయ విధేయ రామ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్స్ గా నిలిచాయి..దీనితో నేటి తరం స్టార్ హీరోలు మరియు యువ హీరోలు ఎవ్వరు కూడా బోయపాటి శ్రీను తో సినిమాలు చెయ్యడానికి సాహసించలేదు.
కానీ అఖండ సినిమాతో తనని తానూ ప్రూవ్ చేసుకోవడం తో ఆయనతో సినిమాలు చెయ్యడానికి ఇప్పుడు యంగ్ హీరోలు క్యూ కడుతున్నారు..అలా వచ్చిన ప్రాజెక్ట్ రామ్ పోతినేని తో సినిమా అని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్న వార్త..ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ సినిమా కథ గతం లో రవితేజ తో బోయపాటి శ్రీను చేసిన భద్ర సినిమా టైపు లో ఉంటుంది అట..బోయపాటి శ్రీను సినిమాల్లో ఇప్పటికి ప్రతి ఒక్కరు నచ్చే సినిమా భద్ర అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఆ టైపు లోనే ఎంటర్టైన్మెంట్, కామెడీ, మాస్ మరియు సెంటిమెంట్ ఇలా అన్ని కలగలిపి ఒక్క అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసాడట బోయపాటి శ్రీను..ఈ సినిమా హీరో రామ్ కెరీర్ లో ఒక్క మైలు రాయిగా నిలిచిపొయ్యే విధంగా తీర్చిదిద్దాడు అట బోయపాటి శ్రీను..ఈసారి తన స్టైల్ లో కాకుండా పూర్తిగా రామ్ స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు అట బోయపాటి శ్రీను..గతం లో అల్లు అర్జున్ తో తెరకెక్కించిన సరైనోడు సినిమా కూడా అల్లు అర్జున్ స్టైల్ లో తీసాడు కాబట్టే అంత పెద్ద హిట్ అయ్యింది..మళ్ళీ అదే ఫార్ములా ని ఫాలో అవ్వబోతున్నారు అట బోయపాటి శ్రీను..చూడాలి మరి యువ హీరోలతో సినిమాలు చేస్తే బోయపాటి శ్రీను సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే సెంటిమెంట్ ని ఈ సినిమాతో బ్రేక్ చేస్తాడో లేదో అనేది.