Venkatesh – Trivikram : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి, దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయి దర్శకులుగా వెలుగొందుతున్నారు. ఇక లాంటి సందర్భంలో త్రివిక్రమ్ సైతం మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొంది పాన్ ఇండియా స్టాయిలో తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన తన దర్శకత్వ ప్రతిభతో చాలా సినిమాలను సక్సెస్ ఫుల్ గా విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పుడు వెంకటేష్ ను హీరో పెట్టి ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్ ఆమెను ఫిక్స్ చేశాడా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది స్టార్ హీరోలు ఆయన సినిమాల్లో చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ప్రతి ఒక్క హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన సినిమాల్లో ఒక డిఫరెంట్ నరేషన్ అయితే ఉంటుంది. దాన్ని ఆయన స్పెసిఫిక్ గా ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది.
కాబట్టి అలాంటి సినిమాల్లో చేస్తే హీరోలకు మంచి ఇమేజ్ దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ లేకపోవడం వల్ల స్టార్ హీరోలేవరు అవకాశాలు అయితే ఇవ్వడం లేదు. అందువల్లే ఆయన ఇప్పుడు వెంకటేష్ తో సినిమాను చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో త్రివిక్రమ్ బ్రాండ్ వాల్యూ చాలా వరకు పడిపోయింది. ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు చాలామంది ప్రేక్షకులు అటెన్షన్ తో ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే తప్ప లేకపోతే ఆయనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలైతే రాకపోవచ్చు…