Venkatesh Trivikram Movie Updates: మాటల మాంత్రికుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…ఆయన కెరియర్లో చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. దాదాపు 90% సక్సెస్ రేట్ తో ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను చేస్తున్నాడు. గతంలో ఆయన రచయితగా చేసిన ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇందులో వెంకటేష్ ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. అలాంటి వెంకటేష్ తో ఇప్పటివరకు త్రివిక్రమ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని ఒక సీన్ ని ఈ సినిమాలో రీ క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఆ సీన్ ఏంటంటే వెంకటేష్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్నప్పుడు చేసే ప్రేయర్ చాలా కామెడీగా ఉంటుంది. ఇప్పటికే ఈ క్లాసెన్ ను చాప సినిమాలో వాడుకున్నారు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి ఈ సీన్ ను రీ క్రియేట్ చేస్తున్నారట. అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి వెంకటేష్ మరోసారి ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ను రీ క్రియేట్ చేసి కామెడీని పండించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ కామెడీకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
గత కొద్దిరోజుల నుంచి ఆయన సినిమాలో కొంతవరకు కామెడీ మిస్ అవుతోంది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఆయన వెంకటేష్ ని ఎంచుకొని ఈసారి ఫుల్ లెంత్ కామెడీ సినిమాని చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ వెంకటేష్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం సంక్రాంతి కానుక వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది… ఇక ఇప్పుడు ఆ సినిమా మాదిరిగానే త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందని వెంకటేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం విశేషం…