Venkatesh Son Latest Photo: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులను మెప్పించిన సినిమాలే కావడం విశేషం…శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి తీసుకువచ్చిన ఘనత కూడా వెంకటేష్ కే దక్కుతోంది. ఒకానొక సందర్భంలో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే సినిమాలను చేసిన ఆయన గొప్ప విజయాలను కూడా సాధించాడు. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వైవిద్య భరితమైన క్యారెక్టర్స్ ని కూడా పోషించి మెప్పించాడు. ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ సైతం తన కొడుకు అయిన అర్జున్ ను హీరోగా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అర్జున్ సైతం పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. వెంకటేష్ కూడా అతన్ని పబ్లిక్ గా తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో ఫంక్షన్ లో అటు మహేష్ బాబు కొడుకు గౌతమ్, ఇటు వెంకటేష్ కొడుకు అర్జున్ చేతుల మీదుగా ఆడియోని రిలీజ్ చేశారు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ – ఆర్జీవీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్ అవ్వడానికి కారణం ఎవరు..?
నిజానికి చాలా మంది ప్రేక్షకులకు వెంకటేష్ కి ఒక కొడుకు ఉన్నాడనే విషయం కూడా అప్పుడే తెలిసింది. ఇక ఇప్పుడు ఆయన సినిమాకు సంబంధించిన క్రాఫ్ట్ లను నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. యాక్టర్ గా కూడా కొన్ని మెలుకువలు నేర్చుకుంటూ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక గతంలో వెంకటేష్ తో కలిసి దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వెంకటేష్ పక్కన నిలబడి ఉన్న అర్జున్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని, చూడటానికి హీరో కటౌట్ లా కనిపిస్తున్నాడు. తొందరగా హీరోగా దింపితే మంచిది అంటూ కొంత మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రానా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సాధిస్తూ విలక్షణ నటుడిగా ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా రానా వాళ్ళ తమ్ముడు అభిరామ్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆయన ఆశించిన మేరకు సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు…ఇక అర్జున్ హీరోగా ఎంట్రీ ఇస్తే వెంకటేష్ మాదిరిగా స్టార్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…