నాగచైతన్య – సమంత విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తూ క్లారిటీ ఇచ్చిన దగ్గర నుంచి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరో పక్క సమంత వ్యక్తిగత జీవితం పై పుకార్లను పుట్టిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సమంత – చైతు విడిపోవడానికి కారణం.. సమంతకు మరో ఎఫైర్ ఉందంటూ అభ్యంతరకరమైన రూమర్స్ ను వైరల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్టరీ వెంకటేశ్ ఓఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘మనం ఏదైనా విషయం పై పెదవి విప్పే ముందు, దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అని వెంకీ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. వెంకీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. పైగా ఆయన ఇలా నర్మగర్భంగా పోస్ట్ లు పెట్టరు.
అలాంటిది వెంకీ ఇలా పోస్ట్ పెట్టడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం సామ్ – చైతు విడాకుల వ్యవహారం, అలాగే సమంత ఎఫైర్ పై వస్తోన్న ఆరోపణలకు అనుగుణంగానే వెంకటేష్ ఈ పోస్ట్ పెట్టినట్లు అర్ధం అవుతుంది. ఇక ఇప్పటికే చై – సామ్ విడాకుల ప్రకటన పై అక్కినేని ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేశారు.
అక్కినేని నాగార్జున వీరి విడాకుల పై స్పందిస్తూ.. ‘సమంత, చైతు విడిపోవటం నిజంగా ఎంతో దురదృష్టకరం. అయితే, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతమైన విషయం. కానీ, సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంత మా ఫ్యామిలీకి చాలా దగ్గరైంది. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ నాగార్జున పోస్ట్ చేశారు.
అలాగే సమంత తండ్రి కూడా ఈ విషయం పై స్పందిస్తూ.. ‘సమంత – చైతు జోడీ చూడముచ్చటగా ఉండేది. కానీ వాళ్లిద్దరూ విడిపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు.