Sankranthiki Vasthunam OTT
Sankranthiki Vasthunam OTT: విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthi Ki Vastunnam Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రాంతీయ బాషా చిత్రాల్లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఏకైక సినిమాగా నిల్చి, ఇండస్ట్రీ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా ఆడుతూనే ఉంది. 50 రోజుల కేంద్రాలు కూడా బలంగానే ఉండేలా ఉన్నాయి. అయితే థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాని గత శనివారం జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. అదే రోజున జీ5 ఓటీటీ యాప్ లో కూడా విడుదల చేసారు. రెండిట్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీ లో అయితే ఆడియన్స్ విరగబడి చూసారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read: విడుదలైన ‘చావా’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్..హీరోకి ఇచ్చిన డబ్బింగ్ అసలు సూట్ అవ్వలేదుగా!
#RRR , ‘హనుమాన్’ వంటి చిత్రాలకు 12 గంటల్లో నాలుగు భాషలకు కలిపి వచ్చిన వ్యూస్ కంటే కేవలం ‘తెలుగు’ వెర్షన్ లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఎక్కువ వచ్చాయట. జీ5 సంస్థ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 12 గంటల్లో 12 లక్షల మంది చూశారట. టీవీ టెలికాస్ట్ సమయంలో కూడా ఆడియన్స్ యాప్ లో చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపారట. ఎందుకంటే యాప్ లో చూస్తే మధ్యలో యాడ్స్ ఉండవు, అదే టీవీ లో చూస్తే ప్రతీ 5 నిమిషాలకు ఒక యాడ్ వస్తుంది. అందుకే టెలికాస్ట్ సమయంలోనే ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీ లో చూసి ఉంటారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. టీఆర్పీ రేటింగ్స్ కూడా బలంగానే వచ్చాయట కానీ, ఆల్ టైం రికార్డు రేంజ్ లో రేటింగ్ వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే వారం ఎంత టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చింది అనేది తెలియనుంది.
ఇటీవల కాలం లో జీ తెలుగు ఛానల్ లో బ్లాక్ బస్టర్ సీరియల్స్ కరువు అయ్యాయి. ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా మిగిలిన చానెల్స్ తో పోలిస్తే చాలా తక్కువ. కొత్త సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ ఛానల్ కి లాభాలను తెచ్చిపెట్టడం లో విఫలం అయ్యాయి. అందుకే జీ తెలుగు వారు ఈ చిత్రాన్ని శనివారం రోజున తమ ఛానల్ లో వచ్చే సీరియల్స్ అన్నిటిని ఆపేసి ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఓటీటీ మీద పెద్దగా అవగాహన లేని వాళ్లంతా ఈ సినిమాని టీవీ లో చూసారు. 15 కి పైగా రేటింగ్స్ వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. శనివారం కంటే ఆదివారం రోజున ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేదని పలువురి అభిప్రాయం. ఎందుకంటే శనివారం రోజున ఇతర చానెల్స్ లో టీవీ సీరియల్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు, ఈ చిత్రాన్ని కేవలం విరామం సమయంలోనే చూసుంటారు.
Also Read: జడ వేసి.. హీరో నానినే చూపించలేదే.. ‘ప్యారడైజ్’లో శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీ ఏంటి.?