Venkatesh: వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ తన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ఆయన సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేశారు. ప్రేమంటే ఇదేరా చిత్రంలోని ‘నైజాం బాబులు’ సాంగ్ కి వెంకటేష్ వేడుక మీద డాన్స్ చేశారు.
వెంకటేష్ తో పాటు శ్రద్దా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా సైతం స్టెప్స్ వేశారు. వీరితో దర్శకుడు శైలేష్ కొలను జాయిన్ అయ్యాడు. వెంకీ మామ డాన్స్ కి ఫ్యాన్స్ ఈలలు, కేకలు వేశారు. సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సన్నివేశాలు అలరించాయి. ఇక సైంధవ్ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. కూతురు సెంటిమెంట్ జోడించి మూవీ తెరకెక్కించారు.
ఏడేళ్ల పాప తండ్రిగా సైంధవ్ చిత్రంలో వెంకటేష్ కనిపించనున్నారు. పాప అరుదైన వ్యాధికి గురవుతుంది. కాపాడుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన మెడిసిన్ కావాలి. దాని కోసం తండ్రి ఏం చేశాడనేది కథ. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా రూపొందించారు. స్టార్ క్యాస్ట్ చాలా మంది భాగం అయ్యారు.
సైంధవ్ చిత్రంలో మొదటిసారి బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. జిషు సేన్ గుప్త, కోలీవుడ్ హీరో ఆర్య సైతం కీలక రోల్స్ చేశారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా జనవరి 13న విడుదలవుతుంది. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి.