Tollywood Heroes: గత సంవత్సరం ముగిసింది. మన స్టార్ హీరోల్లో చాలా మంది గడిచిన సంవత్సరం లో థియేటర్లకు రాలేకపోయారు. అందుకే మన తెలుగు సినిమా హవా తగ్గింది. అందుకే మన స్టార్ హీరోలు 2024 ని టార్గెట్ చేసుకొని బరిలోకి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఇక 2023 చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ లకు మాత్రమే పరిమితమైంది. మరి 2024వ సంవత్సరంలో ఏ హీరో ఏ టైంలో సిల్వర్ స్క్రీన్ మీద దండయాత్ర చేయబోతున్నాడో తెలుసుకుందాం రండి…
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, 13 వ తేదీన వెంకటేష్ సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను అల్లరించడానికి వస్తున్నాడు. అలాగే నాగార్జున 14 వ తేదీన నా సామి రంగా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఇలా స్టార్ హీరోలు ముగ్గురు సంక్రాంతి రేసు లో నిలవడంతో ఈ సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ అనేది అత్యంత ఆసక్తికరమైన మారనుందని తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా యంగ్ హీరో అయిన తేజ సజ్జా హీరో గా వస్తున్న హనుమాన్ సినిమా కూడా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ అవుతుంది. తేజ సజ్జ స్టార్ హీరో కాదు కాబట్టి ఈ సంక్రాంతి ముగ్గురు స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో వస్తున్నారు.ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలతో పాటు గా తేజ సజ్జ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు…
ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాని తెరకెక్కించడానికి కొరటాల శివ తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఒక అద్భుతమైన సినిమాగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక తన గత సినిమా అయిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడం తో ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు…
ఇక ఈ సంవత్సరం మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు….సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలక్షన్స్ ని రాబట్టింది. కాబట్టి పుష్ప 2 సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..
ఇక ఆగస్టు ముగిసిన వెంటనే సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ తన ఓజీ సినిమాతో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ గత సంవత్సరంలో బ్రో అనే సినిమాతో మన ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓ జి సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ నెలలో వచ్చి భారీ సక్సెస్ ని అందుకుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా 2024 సమ్మర్ కి గాని, లేదంటే దసరా కి గాని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమాతో బాలయ్య సక్సెస్ సాధించి వరుసగా నాలుగు విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక బాబి కూడా ఇప్పటికే సీనియర్ హీరో అయిన చిరంజీవికి ఒక మంచి హిట్ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి బాలయ్య బాబుకి కూడా అదే రేంజ్ లో హిట్ ఇస్తాడని నందమూరి అభిమానులు చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు…
ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేజర్ సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో మరో భారీ సక్సెస్ ను కొట్టబోతున్నాడు అంటూ మెగా అభిమానులు ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి మ్యాజిక్ ని చేస్తాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కంటే కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం శంకర్ కి చాలా కీలకంగా మారనుంది.ఎందుకంటే తన గత సినిమాలు అయిన స్నేహితుడు, ఐ,రోబో 2.0 లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో శంకర్ మార్కెట్ అనేది భారీగా పడిపోయింది. ఇక ఇప్పుడు కనక ఆయన సక్సెస్ కొట్టి మరొకసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే ఈయన పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడు లేదంటే మాత్రం ఆయనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం కూడా కష్టమే అవుతుంది…
ఇక పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పూరి మరొకసారి పాన్ ఇండియా లెవల్లో తన పంజా విసరబోతున్నాడు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే రామ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని తెలుస్తుంది…
ఇక ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి, మారుతితో చేస్తున్న సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకులని అలరించబోతున్నాడు…
ఇక ఏది ఏమైనా కూడా 2023లో ఏదైతే మిస్ అయిందో 2024లో దాన్ని ఫుల్ ఫీల్ చేయడానికి మన స్టార్ హీరోలు అందరూ కూడా చాలా రకాలుగా కష్టపడుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది…