Venkatesh New Movies 2026: తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరు సీనియర్ హీరోలు అయిపోయారు. వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. నాగార్జున ఒక్కడే వెనుకబడి ఉన్నాడు. ముగ్గురు హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తనలోని పూర్తిస్థాయి నటుడుని బయటికి తీసే అవకాశాలైతే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వెంకటేష్ తో అందరు కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తున్నారు. అలా కాకుండా ఒక ఇంటెన్స్ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఆయన ఘర్షణ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక మరోసారి అలాంటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తే బాగుంటుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికి దర్శకులు మాత్రం అతని దగ్గరికి అలాంటి కథలతో రావడం లేదట.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
ఇక మరి కొంతమంది మాత్రం వెంకటేష్ శైలేష్ కొలన్ దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమా ఇంటెన్స్ డ్రామా గా తెరకెక్కినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అలాంటి సినిమాలను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమాలు కావడం విశేషం… ఇక మీదటైనా ఆయన తన పంథా ను మార్చుకొని సక్సెస్ఫుల్ సినిమాలను అలాగే ప్రయోగాత్మకమైన సినిమాలు చేయగలిగితే బాగుంటుంది అంటూ విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు… ఇక వెంకటేష్ ఎప్పుడు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలనే చేస్తున్నాడు అని మరికొంతమంది అతని మీద సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
కానీ ఏది ఏమైనా కూడా ప్రేక్షకుడికి నచ్చే సినిమా చేయడమే తన ధర్మం అని వెంకటేష్ గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. కొన్ని మంచి సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తూ ఉండటం వల్ల అవి ఫ్లాప్ అవుతుంటాయి. ఇక ఇలాంటి సందర్భంలో కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడమే ఉత్తమమని రొటీన్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు…
