Venkatesh Kalyan Ram Anil Ravipudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన ఫ్యూచర్లో పాన్ ఇండియా సబ్జెక్టులను సైతం డీల్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక భారీ సినిమాని చేస్తున్నాడు…
ఈ సినిమా కోసం వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అంటే వెంకటేష్ 40 కోట్లు, అని రావిపూడి 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ సైతం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు 85 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ముగ్గురు తీసుకునే రెమ్యూనరేషన్ తో ఒక మీడియం రేంజ్ సినిమా చేయొచ్చని చెబుతున్నారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి చేసే సినిమాలు ప్రొడ్యూసర్ ను సేఫ్ జోన్ లో ఉంచుతాయి. కాబట్టి అతనితో ఎలాంటి సినిమాలు చేసిన ఆ సినిమాలు భారీ సక్సెస్ ని సాధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో తెరకెక్కిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…