Actor Venkatesh: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు చాలామంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సినిమాలను చేస్తు పెను ప్రభంజనాలను సృష్టిస్తూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరోక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక వెంకటేష్ గత కొన్ని రోజులుగా చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. అయినప్పటికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాతో ఆయన మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వశిష్ట సింహా ను చెప్పుతో కొట్టాల్సిన సీను ఒకటి ఉంది. అయితే దానికోసం అది డమ్మీగా చేయించిన చెప్పైనా కూడా వెంకటేష్ వశిష్ట ను కొట్టడానికి చాలా వరకు ఇబ్బంది పడ్డాడట.
అయితే అది దెబ్బ తగులుతుందా? లేదా అని ముందుగా వెంకటేష్ తనకు తాను కొట్టుకొని చూసుకున్న తర్వాత వశిష్ట ను కొట్టడానికి సిద్ధమయ్యాడు. అయినప్పటికీ ఆ షాట్ చేసేటప్పుడు వశిష్టను కొనడానికి తను ఇబ్బంది పడి రెండు మూడు టేక్ లైతే తీసుకున్నారట.
ఇక సహనటుడు అయిన వశిష్ట సింహా మాత్రం పరలేదు సార్ నాకేం తగలదు మీరు కొట్టండి అని చెప్పినప్పటికి వెంకటేష్ చాలావరకు ఇబ్బంది పడ్డాడట. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికి అలాంటి సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డాడంటే వెంకటేష్ మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ తనకి మంచి ఐడెంటిటిని తీసుకురావడమే కాకుండా తనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఏరికోరి మరి సినిమాలను చేస్తున్నాడు…