Venkatesh: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న వెంకటేష్…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెస్టివల్ సీజన్స్ సినిమాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది హీరోలు పండగను బేస్ చేసుకొని సినిమాలను రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను సాధించాలని చూస్తారు. తద్వారా ప్రేక్షకులు కూడా పండుగ సీజన్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాలు చూస్తారు. కాబట్టి కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి...

Written By: Gopi, Updated On : October 27, 2024 4:34 pm

Venkatesh

Follow us on

Venkatesh: సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పండుగ సీజన్ వస్తుందంటే సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎక్కువగా సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫెస్టివల్ సమయంలో సినిమాకి కనక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తూ భారీ కలెక్షన్స్ ను రాబడుతుందనే ఉద్దేశ్యం లోనే మేకర్స్ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల సినిమా ఆ కలెక్షన్స్ కి క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి పండగ సీజన్ లో భారీ కలెక్షన్లు రాబట్టాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే సినిమాలను రిలీజ్ చేయాలని ఆ విధంగా ప్రణాళికలైతే రూపొందించుకుంటారు. ఇక వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి మొత్తానికైతే వాళ్లు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్లు సంక్రాంతి బరిలో నిలవడం లేదు కారణం ఏంటి అంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూట్ అనేది పూర్తిగా కాలేదట.

ఇంక దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా లేట్ అవ్వబోతుందని తెలిసి వెంటనే ఈ సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి రామ్ చరణ్ బాలకృష్ణ ల మధ్య భారీ పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలతో ఏ రకంగా ప్రేక్షకులను మెప్పిస్తారు. ఎవరు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ హీరోగా నిలుస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి 2025 సంక్రాంతికి ఈ సినిమాను బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడో పూర్తయినప్పటికీ సంక్రాంతి కానుకగా ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే భారీ కలెక్షన్స్ వస్తాయనే ఉద్దేశ్యం తో దిల్ రాజు ఒక భారీ ప్రణాళికను రూపొందించినట్టుగా తెలుస్తోంది…