https://oktelugu.com/

Kanguva: ‘కంగువ’ చిత్రాన్ని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా? ఇలాంటి ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా!

కంగువ చిత్రం 2000 కోట్లు కొల్లగొడుతుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని ముందుగా సూర్య తో తియ్యాలని అనుకోలేదట. మన టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా , పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తో తియ్యాలని అనుకున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : October 27, 2024 / 04:29 PM IST

    Kanguva

    Follow us on

    Kanguva: సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సూర్య హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘కంగువ’ నవంబర్ 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం మూవీ టీం చురుగ్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిన్న సూర్య బిగ్ బాస్ ఎపిసోడ్ లో కూడా కనిపించి తన సినిమాకి ప్రొమోషన్స్ చేసుకున్నాడు. అలా ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ‘కంగువ’ గురించే చర్చలు నడుస్తున్నాయి. గోపీచంద్ తో శౌర్యం, శంఖం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ, కంగువ కి దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఇలా ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ కంటెంట్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది. ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీ ఈ చిత్రాన్ని ‘బాహుబలి’, #RRR రేంజ్ లో విజయం సాదిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవుతున్న సినిమాలు కొన్ని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతున్నాయి.

    కానీ కంగువ చిత్రం 2000 కోట్లు కొల్లగొడుతుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని ముందుగా సూర్య తో తియ్యాలని అనుకోలేదట. మన టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా , పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తో తియ్యాలని అనుకున్నారట.పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో స్టూడియో గ్రీన్ సంస్థ అల్లు అర్జున్,లింగు స్వామి కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించారు. కానీ ఎందుకో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే స్టూడియో గ్రీన్ సంస్థ నుండి అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి, భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద సినిమా చేద్దాం అని అన్నాడట అల్లు అర్జున్.

    అప్పుడు స్టూడియో గ్రీన్ సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ వెల్ రాజా డైరెక్టర్ శివ దగ్గర ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథ ఉంది. ఇప్పటి వరకు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి జానర్ ఎప్పుడు రాలేదు, మీరు సమయం ఇస్తే అతను వచ్చి స్టోరీ వినిపిస్తాడు అని అన్నాడట. అల్లు అర్జున్ శివ ని పిలిపించి కథ విన్నాడు. ఆయనకు తెగ నచ్చేసింది. కానీ అల్లు అర్జున్ అప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడట. ఇవి పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం చేద్దాం అని అన్నాడట. కానీ బాగా ఆలస్యం అవుతుండడంతో ఇదే కథని సూర్య కి వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పి షూటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ సినిమా ఔట్పుట్ అదిరిపోయిందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. అదే నిజమైతే అల్లు అర్జున్ నుండి ఒక మంచి సినిమా చెయ్యి జారినట్టే అనుకోవాలి.