Devara: 5వ వారంలోనూ అదే ఊపు.. 30వ రోజు ‘దేవర’ రాబట్టిన వసూళ్లను చూసి ఆశ్చర్యపోతున్న ట్రేడ్!

ధారణంగా ఇలాంటి థియేట్రికల్ రన్ సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్ లోనే వస్తుంటాయి. కానీ దసరా సీజన్ లో ఈ రేంజ్ రన్ మాత్రం ఈమధ్య కాలం లో 'దేవర' చిత్రానికే చూస్తున్నాము. గతంలో 'దూకుడు', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాలు దసరా లో దుమ్ము లేపాయి.

Written By: Vicky, Updated On : October 27, 2024 4:36 pm

Devara Collection(3)

Follow us on

Devara ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం విడుదలై 30 రోజులు పూర్తి అయ్యింది. ఈ 30 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పిన రికార్డులను నందమూరి అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి చిత్రం తర్వాత అంతటి బలమైన బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందా అంటే అది దేవరనే. ఈ స్థాయి లాంగ్ రన్ ఎన్టీఆర్ సినిమాకి చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్టీఆర్ సినిమాలకు లాంగ్ రన్స్ ఉండవు, కేవలం ఓపెనింగ్స్ మాత్రమే ఉంటాయి అని సోషల్ మీడియా లో అప్పట్లో ట్రోల్స్ వేసేవారు. కానీ ‘దేవర’ చిత్రం నెల రోజులు దాటినప్పటికీ కూడా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ, కొత్త సినిమాలను సైతం డామినేట్ చేస్తుందంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు.

సాధారణంగా ఇలాంటి థియేట్రికల్ రన్ సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్ లోనే వస్తుంటాయి. కానీ దసరా సీజన్ లో ఈ రేంజ్ రన్ మాత్రం ఈమధ్య కాలం లో ‘దేవర’ చిత్రానికే చూస్తున్నాము. గతంలో ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు దసరా లో దుమ్ము లేపాయి. వాటి తర్వాత ‘దేవర’ కి అలాంటి బాక్స్ ఆఫీస్ రన్ వచ్చింది. అయితే ఈ వీకెండ్ పెద్దగా సినిమాలేవీ విడుదల కాకపోవడం వైజాగ్, గుంటూరు, విజయవాడ, రాయలసీమ వంటి ప్రాంతాలలో మళ్ళీ కలెక్షన్స్ ఊపందుకున్నాయి. 30 వ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 41 లక్షల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి. రెండు మూడు వారల బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత ఓటీటీ లోకి నేరుగా సినిమాలను విడుదల చేస్తున్న ఈరోజుల్లో నెల రోజుల తర్వాత కూడా 40 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు ఈ సినిమాకి వస్తుండడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఆ స్థాయిలో ఆడేందుకు కంటెంట్ పెద్దగా ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది కానీ, సెకండ్ హాఫ్ బాగా డౌన్ అయ్యింది. ఎన్నో నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. వీకెండ్ వరకు బాగా ఆడి పడిపోతుందని అందరూ అనుకున్నారు.

కానీ వీకెండ్ తర్వాత కూడా ఇంతటి లాంగ్ రన్ వచ్చిందంటే, అది ఎన్టీఆర్ స్టామినా వల్లే సాధ్యపడింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి నెల రోజులకు కలిపి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 215 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. దీపావళి వరకు రన్ ఉండే అవకాశం ఉండడం తో మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా ఈ సినిమా రాబట్టే అవకాశం ఉంది. అలాగే ఈ చిత్రం 200 కి పైగా డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.