Homeఎంటర్టైన్మెంట్Venkatesh: తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయాను, తల్లడిల్లిపోతున్న వెంకటేష్.. లెజెండ్ రామానాయుడు కోరుకుంది ఇదే!

Venkatesh: తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయాను, తల్లడిల్లిపోతున్న వెంకటేష్.. లెజెండ్ రామానాయుడు కోరుకుంది ఇదే!

Venkatesh: వెంకటేష్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా ఎఫ్ 2 ఆ ఏడాదికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. విలేజ్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కింది. ఐశ్యర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. హోస్ట్ బాలయ్య ఆసక్తికర ప్రశ్నలతో మనకు తెలియని సమాచారం వెంకటేష్ నుండి రాబట్టాడు. ఈ టాక్ షోలో వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు చివరి కోరిక తెలియజేశాడు. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారని చెప్పి ఉద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యంతో బెడ్ పై ఉన్నపుడు కూడా రామానాయుడు స్క్రిప్ట్స్ చదువుతూ ఉండేవారట. ఆయనకు అది ఇష్టమైన పని అట.

ఒక కథ ఆయనకు బాగా నచ్చిందట. ఆ చిత్రంలో వెంకటేష్ తో కలిసి రామానాయుడు నటించాలని అనుకున్నారట. అయితే రామానాయుడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుదర్లేదట. కొంచెం కోలుకున్నాక మూవీ చేద్దాం అనుకున్నారట. అయితే అంతలోనే ఆయన మరణించారు. నాన్న చివరి కోరిక నెరవేరలేదని వెంకీ అన్ స్టాపబుల్ షోలో చెప్పి బాధపడ్డారు. కాగా రామానాయుడు అనేక సినిమాల్లో గెస్ట్స్ రోల్స్ చేశారు. ప్రేయసిరావే తో పాటు అనేక సినిమాల్లో రామానాయుడు గెస్ట్ రోల్స్ చేయడం విశేషం.

ఓ చిత్రంలో ఆయన లీడ్ రోల్ చేయడం విశేషం. దాదా సాహెబ్ అవార్డు గెలుచుకున్న రామానాయుడు 2015లో కన్నుమూశారు. ఆయన మరణం అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ హవా తగ్గింది. సురేష్ బాబు నిర్మాణం పై దృష్టి తగ్గించారు. భారీ బడ్జెట్ మూవీస్ చేయడం లేదు. సేఫ్ జోన్ లో ఉండేలా మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular