Venkatesh Chanti Movie Child Artist: వెంకటేష్ సినీ కెరీర్ లో “చంటి” సినిమా ప్రత్యేకమైనది. అప్పట్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఈ సినిమా వెంకటేష్ కి సోలో మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇంటిల్లిపాదినీ అలరించి పెద్ద విజయమే సాధించింది. పైగా మహిళా ప్రేక్షకులకు వెంకటేష్ ను దగ్గర చేసింది. అయితే, ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కూడా ఉన్నాడు.
ఇంతకీ ఎవరు అంటే అతను.. ఈ చిత్రంలో ‘వెంకటేష్ చిన్నప్పటి పాత్ర’లో నటించిన ‘అజయ్ రాఘవేంద్ర’. ఈ సినిమా చేసే సమయంలో అతని వయసు పదేళ్లు. అయినా తన సహజమైన నటనతో ఎంతో గొప్పగా నటించాడు. చంటి తర్వాత ‘అజయ్’ హీరోగా వచ్చిన ‘మా బాపు బొమ్మకు పెళ్ళంట’ అనే సినిమాలో కూడా ‘అజయ్ రాఘవేంద్ర’ నటించి మెప్పించాడు.
Also Read: ఈ వారం నామినేట్ అయింది వీరే.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐతే, నటుడిగా విజయం సాధించినా ‘అజయ్ రాఘవేంద్ర’కు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తన సినీ కెరీర్ ను మధ్యలో ఆపేసి యూఎస్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం ‘అజయ్ రాఘవేంద్ర’ ఐటీ రంగంలో ఉన్నాడు. భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నాడు.
అదేవిధంగా ప్రస్తుతం సినిమా మేకింగ్ పై ఓ స్పెషల్ కోర్సు కూడా చేస్తున్నాడట. తెలుగు నేటివిటీని చూపిస్తూ ఓ హాలీవుడ్ సినిమా చేయాలని అతని చిరకాల కోరిక అట. ఇక ‘అజయ్ రాఘవేంద్ర’ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అతనికి పెళ్లి ఒక పాప కూడా ఉంది.
తనది ప్రేమ వివాహం అని, తన సినీ జీవితం తన భార్యకు తెలుసు అని, ఆమె తాను మళ్లీ నటిస్తే చూడాలని ఆశ పడుతుంది అని ‘అజయ్ రాఘవేంద్ర’ చెప్పుకొచ్చాడు. మరి ఈ టాలెంటెడ్ నటుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని.. తన నటనతో అందర్నీ అలరించాలని కోరుకుందాం.