Telugu Hit Movies: బాక్సాఫీస్ : ఎంత గొప్ప విజయమైనా మూన్నాళ్ళ ముచ్చటే

Telugu Hit Movies: ఎంత గొప్ప విజయం అయినా కొన్నాళ్ళకు పాత వాసన వస్తోంది. అందుకే.. విజయాలు చరిత్ర పుస్తకంలో కథలుగా మారిపోతున్నాయి. ఆ కథలకు పుకార్లు తోడు అవుతాయి. చివరకు వాస్తవికతను కోల్పోతాయి. ఉదాహరణకు సినిమాల విషయానికి వద్దాం. ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. అయితే, కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. ఎందుకని ? ఈ కాలపు సినిమాలే కారణం. పాత సినిమాలలో కొన్ని ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే […]

Written By: Shiva, Updated On : March 15, 2022 2:53 pm
Follow us on

Telugu Hit Movies: ఎంత గొప్ప విజయం అయినా కొన్నాళ్ళకు పాత వాసన వస్తోంది. అందుకే.. విజయాలు చరిత్ర పుస్తకంలో కథలుగా మారిపోతున్నాయి. ఆ కథలకు పుకార్లు తోడు అవుతాయి. చివరకు వాస్తవికతను కోల్పోతాయి. ఉదాహరణకు సినిమాల విషయానికి వద్దాం. ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. అయితే, కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. ఎందుకని ? ఈ కాలపు సినిమాలే కారణం.

Radhey Shyam

పాత సినిమాలలో కొన్ని ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ ప్రమాణాలు మారిపోయాయి; కొలబద్దలు మారిపోయాయి. అసలు ‘హిట్’ అనేది ఎలా కొలుస్తాం? ‘బ్లాక్ బస్టర్’ అని దేనిని అంటాం ? కేవలం ఆ సినిమాని ఆ హీరో అభిమానులు విరగబడి చూస్తే ఆ చిత్రం ‘హిట్’ అయినట్టా ? ఒక ‘సామాజిక వర్గం’వారు మాత్రం ఒక సినిమాను ఆదరిస్తే ఆ సినిమా హిట్ అయినట్టా ?

Also Read:  ‘బాహుబలి 3’లో ఎన్టీఆర్.. ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటే ?

లేక, మొదటి రోజు, మొదటి రోజు కలెక్షన్లను బట్టి సినిమా సామర్థ్యాన్ని నిర్ణయించాలా ? ఎన్ని ధియేటర్లలో విడుదల చేయబడిందో దానిని బట్టి నిర్ణయించాలా ? లేకపోతే, పాటలకు, ట్రైలర్ కు, టీజర్ కు యూట్యూబ్ లో విడుదలైన మొదటి గంటలో ఎన్ని ‘వ్యూస్’ వచ్చాయో ఆ సంఖ్యను బట్టి నిర్ణయించాలా ? లేదా, హీరోయిన్ తీసుకొన్న పారితోషికాన్ని బట్టి నిర్ణయించాలా ?

సినిమాలో ఐటమ్ సాంగ్ హిట్టయితే సినిమా హిట్టయినట్టేనా ? ఇలా ఎన్నిఎన్నో లెక్కలు చెబుతారు హిట్ కి. ఇప్పటి ప్రమాణాల ప్రకారం పైవాటిలో ఏది జరిగినా కూడా సినిమా హిట్ అనే చెబుతున్నారు. ఈ ప్రమాణాల ప్రకారం హిట్ అనిపించుకున్న ఏ సినిమా కూడా రెండు వారాల తర్వాత మనకు దియేటర్లలో కనిపించడం లేదు. బహుశా అక్కడితో ఆ సినిమా లైఫ్ టైం అయిపోయినట్లుగా భావించవచ్చు.

Akhanda, Pushpa

ఎందుకంటే, పైన చెప్పిన ‘హిట్’ లక్షణాలు అన్నీ కూడా ముఖ్యంగా సంఖ్యాపరమైనవే. అలాంటి సంఖ్యలను ఇంకా ఎక్కువ సాధించే దిశలోనే తయారవుతున్నాయి ఈ కాలం సినిమాలు. కొత్తగా వచ్చే సినిమాలు ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలను సాధించడం వలన పాత చిత్రాల గణాంకాలు మూలాన పడిపోతున్నాయి. అందుకే, నేటి గొప్ప హిట్ కొన్నాళ్ళకు ఎవరికీ గుర్తు ఉండటం లేదు. మొత్తమ్మీద ఎంత గొప్ప విజయమైనా మూన్నాళ్ళ ముచ్చటే !

Also Read: ప్చ్.. ‘రాధేశ్యామ్’ పరిస్థితి మరీ ఇంత దారుణమా ?

Tags