Venkatesh-Anudeep : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు వెంకటేష్ (Venkatesh)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలావరకు ఆచి తూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnaam) సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ విజయంతో తనకంటూ ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే కామెడీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుదీప్ డైరెక్షన్ లో కూడా వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. మొత్తానికైతే ఇప్పుడు వెంకటేష్ అనుదీప్ తో ఒక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం.
Also Read : శ్రీవిష్ణు కి బంపర్ ఆఫర్..బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ..డైరెక్టర్ ఎవరంటే!
ఇక ఇప్పటివరకు వెంకటేష్ ఎన్ని విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా ఇప్పుడు ఆయన సాధించబోయే విజయాలు ఆయనకి చాలా కీలకం గా మారబోతున్నాయి. ఎందుకంటే సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి అందరికంటే తను టాప్ లెవెల్లో ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు.
ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటే బాగుంటుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం… కామెడీ సినిమా అయిన, మాస్ సినిమా అయిన దేనికైనా సరే సెటైపోయే క్యారెక్టర్ వెంకటేష్ గారిది.అయితే ఆయన అనుదీప్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు.
కానీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుంది అంటూ వెంకటేష్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం అనుదీప్ విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు
Also Read : USA లో ఎటు చూసిన ‘పుష్ప’ మేనియా నే..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!