https://oktelugu.com/

Venkatesh : వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ లా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వబోతుందా..? ఒకప్పటి స్టార్ హీరోయిన్ ను గుర్తు చేస్తున్న ముద్దుగుమ్మ…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2025 / 09:46 AM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం సీనియర్ హీరోలు సైతం మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా వాళ్ళకంటూ ఒక భారీ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశంతో వాళ్లు మంచి సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దాంతో పాటుగా మరోసారి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని ఉద్దేశ్యంతో వీళ్ళిద్దరూ కలిసి స’ంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కి మరొక వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేస్తున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి ప్రమోషన్ బాధ్యతలు తీసుకొని తనే స్వయంగా కొన్ని స్కిట్స్ చేసి వాటి రూపంలో ప్రమోషన్స్ చేయడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద వస్తున్న హైప్ చూస్తుంటే సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. తద్వారా వెంకటేష్ కెరీర్ కి మరింత హెల్ప్ అవుతుంది అంటూ చాలా మంది జనాలు కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా భారీ అంచనాలతో రావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వచ్చిన ‘గోదావరి గట్టుమీద సందమామవే’ అనే సాంగ్ భారీ రెస్పాన్స్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

    అయితే ఈ సాంగ్ లో గాని, సినిమా మొత్తం లో గాని వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి పలు సందర్భల్లో తెలియజేస్తున్నాడు. అయితే ఒకప్పుడు వెంకటేష్, సౌందర్యల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ అయితే ఉండేదో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి ఒక కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెప్పారు.

    తద్వారా ఒకప్పటి హీరోయిన్ అయిన సౌందర్య గారిని గుర్తు చేసిన ఐశ్వర్య రాజేష్ కి తెలుగు జనాలందరూ ఫిదా అయిపోతారు అంటూ ఆయన చెబుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక జనవరి 12వ తేదీన ఈ సినిమా రానున్న నేపధ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే పెరిగిపోయాయి…