Varun Tej : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంటలకు బిడ్డ పుట్టబోతున్నారని, త్వరలోనే వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రచారం జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇది నిజమో కాదో అని అభిమానులు అనుకున్నారు కానీ, కాసేపటి క్రితమే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అధికారిక ప్రకటన చేసాడు. అందుకు సంబంధించిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘జీవితం లో అద్భుతమైన పాత్ర అతి త్వరలోనే పోషించబోతున్నాను’ అంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు చేతుల్లో చేతులు వేసుకొని , చిన్నారి షూస్ ని పట్టున్న ఫోటోని అప్లోడ్ చేశాడు. లావణ్య త్రిపాఠి కూడా ఇదే కంటెంట్ తో పోస్ట్ చేయగా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : వరుణ్ తేజ్ షాకింగ్ మేకోవర్, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెగా హీరో!
ఈ జంట 2023 వ సంవత్సరం లోని నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. సుమారుగా 7 ఏళ్ళ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత, ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి, కొన్నాళ్ళు డేటింగ్ చేసుకున్న తర్వాత ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత వెంటనే బిడ్డల్ని కనేందుకు ఇష్టపడరు. ఎందుకంటే గ్లామర్ పోతే మళ్ళీ సినిమాల్లో అవకాశాల్లో రావు అనే భయం ఉంటుంది కాబట్టి. పిల్లలను కనే విషయం లో మనస్పర్థలు వచ్చి విడిపోయిన సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ కాలం లో లావణ్య త్రిపాఠి కుటుంబం కోసం అలోచించి తన జీవిత ప్రయాణం కొనసాగించడం నిజంగా ఆదర్శప్రాయం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి కచ్చితంగా సినిమాలు చేస్తుంది కానీ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట.
రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉంటుందట. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే కెరీర్ ప్రారంభం లో ఈయన ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ చిత్రం లో వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత కచ్చితంగా మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా నుండే వరుణ్ తేజ్ కి బ్యాడ్ టైం మొదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన చిత్రాల్లో ‘f3’ ఒక్కటే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. సోలో హీరో గా చేసిన సినిమాలన్నీ పోయాయి. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘మట్కా’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో కనీసం వారం రోజులు కూడా ఆడలేకపోయింది ఈ చిత్రం. ఇప్పుడు ఆయన మేర్లపాక గాంధీ తో ఒక సినిమా చేస్తున్నాడు. కనీసం ఈ చిత్రం తో అయినా కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
Also Read : కొత్త ఇంట్లోకి వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?