Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 43 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డు గా నిల్చింది ఈ చిత్రం. ఇక రెండవ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటూ ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 9 కోట్ల 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా రెండవ రోజు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
నాని కి నైజాం ప్రాంతం కంచుకోట లాంటిది అని ట్రేడ్ విశ్లేషకులు అంటూ ఉంటారు. దానిని నిజం చేస్తూ ఈ చిత్రానికి రెండవ రోజున 2 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రానికి రెండవ రోజున 84 లక్షలు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 80 లక్షలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి 45 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 25 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 36 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 34 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 24 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండవ రోజున 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండు రోజులకు కలిపి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రెండు రోజుల్లో రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ వసూళ్లు ఈ రేంజ్ లో కుమ్ముతుంటే, మిగిలిన భాషల్లో మాత్రం ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు నామమాత్రం గానే ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం మిగిలిన బాషల నుండి ఈ చిత్రానికి కేవలం 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలకు కలిపి 57 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 30 కోట్ల 59 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 50 కోట్ల షేర్ ని రాబట్టాలి, ఈరోజు, రేపటితో ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?