Varun Tej-Lavanya Tripathi: మెగా అభిమానులు పండుగ చేసుకునే వార్త. కాసేపటి క్రితమే వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన షూటింగ్ కార్యక్రమాలను మానుకొని తన సతీమణి సురేఖ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లి బిడ్డని చూసి వరుణ్, లావణ్య లకు శుభాకాంక్షలు తెలియజేసారు.రెండు రోజుల క్రితమే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ చనిపోవడం తో మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదం లో ఉన్నారు. ఇంత లోపే ఈ శుభవార్త రావడం గమనార్హం.సుమారుగా నాలుగేళ్ల నుండి ప్రేమించుకుంటూ వచ్చిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ళకే లావణ్య త్రిపాఠి గర్భం దాల్చింది అంటూ శుభవార్త వచ్చింది.
ఇప్పుడు బిడ్డ పుట్టడం తో మెగాస్టార్ ఫ్యామిలీ లో ఆనందం మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. పైగా మెగా ఫ్యామిలీ లో చాలా కాలం తర్వాత పుట్టిన మగబిడ్డ.నాగబాబు కి కూడా లావణ్య త్రిపాఠి ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అన్ని శుభాలే జరిగాయి.నిహారిక కొణిదెల కెరీర్ పరంగా మొట్టమొదటి సక్సెస్ చూసింది. నాగ బాబు కష్టపడి పని చేస్తున్న పార్టీ అధికారం లోకి వచ్చింది.రాజకీయంగా MLC పదవి దక్కింది. త్వరలోనే మంత్రి కూడా కాబోతున్నాడు, ఇలా వరుసగా మొత్తం శుభ కార్యాలు జరుగుతున్నాయి.ఇక వరుణ్ తేజ్ సక్సెస్ కొట్టడం ఒక్కటే బ్యాలన్స్ ఉంది. చాలా కాలం నుండి ఆయన వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. ప్రస్తుత మేర్లపాక గాంధీ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత మెగా కుటుంబం లో మెగా బిడ్డ చిట్టి అడుగులు పడుతుండడం తో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతుంది.