Raja Saab First Song: ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు చాలా రోజుల నుండి ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 5 న విడుదల అవుతుందని అనుకున్న ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ ని చూసినందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువగా పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెడుతూ, కమర్షియల్ సినిమాలను పూర్తిగా దూరం పెట్టాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇది బాగా మిస్ అయ్యారు. ఇప్పుడు ‘రాజా సాబ్’ తో మళ్లీ వింటేజ్ ప్రభాస్ కం బ్యాక్ రాబోతుందని బలంగా నమ్ముతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటని విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్, ఓజీ మూవీ రీ రికార్డింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ వర్క్ మొత్తం పూర్తి అవ్వగానే రాజాసాబ్ కి షిఫ్ట్ అవుతాడని, ఇప్పటికే మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించిన వర్క్ పూర్తి అయ్యిందని. కేవలం ఫైనల్ మిక్సింగ్ మాత్రమే మిగిలిందని, ఓజీ వర్క్ వచ్చే గురువారం తో పూర్తి అవుతుంది కాబట్టి, అది అయిపోయిన వెంటనే ఈ సినిమాకు షిఫ్ట్ అవుతాడని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న ‘కాంతారా : చాప్టర్ 1’ మూవీ కి జత చేస్తారనే టాక్ కూడా ఉంది.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. అయితే ఎప్పుడో జనవరి 9 న విడుదల అవ్వబోయే సినిమాకు, అంత తొందరగా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయడం ఎందుకు?, ఇప్పుడే ట్రైలర్ ని విడుదల చేస్తే, ఇక సినిమా విడుదలకు దగ్గర్లో ఉన్నప్పుడు కంటెంట్ ఏమి మిగిలి ఉంటుంది?, దయచేసి కొన్ని నెలలు ట్రైలర్ విడుదల ని ఆపండి అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ టీం ని ట్యాగ్ చేసి కోరుకుంటున్నారు. మరి మూవీ టీం ఎలా రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ హారర్ చిత్రం ఆడియన్స్ ని ఏమేరకు అలరిస్తుందో చూడాలి.