Varun Tej- Lavanya Tripathi Engagement: హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్ళికి రంగం సిద్ధమైందట. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైందనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం జూన్ 9న నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం కుదిరింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయట. ఎంగేజ్మెంట్ వేడుకకు కావాల్సిన దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారట. ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించనున్నారట. అంటే పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం లేదట.
మెగా హీరోలందరూ పాల్గొననున్నారట. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ హాజరుకానున్న నేపథ్యంలో… ఈ ఈవెంట్ నేషనల్ వైడ్ న్యూస్ కానుందని అంటున్నారు. పెళ్లి మాత్రం చిత్ర ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
గత ఏడాది కాలంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య త్రిపాఠి ఈ వార్తలను ఖండించారు. వరుణ్ తేజ్ నాకు మిత్రుడు మాత్రమే… అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టత ఇచ్చారు. వరుణ్ తేజ్ మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కి జంటగా లావణ్య మిస్టర్ మూవీ చేశారు. శ్రీను వైట్ల ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం.
మరోవైపు లావణ్య కెరీర్ ఫేడ్ అవుట్ దశలో ఉంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. లావణ్య కెరీర్లో సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్స్ ఉన్నాయి. మంచి ఆరంభం లభించినా స్టార్ కాలేకపోయింది. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. అది కూడా నిరాశపరిచింది. వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున మూవీ చేస్తున్నారు. అలాగే కొత్త దర్శకుడితో మరో చిత్రం చేస్తున్నారు.