Junior NTR: ఎన్టీఆర్ పేరు ఇప్పుడు చర్చనీయాంశం. జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ పేరుకు జూనియర్ అర్హుడు కాదని కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య సంతానం కావడంతో అసలు నందమూరి రక్తం కాదని రెచ్చగొడుతున్నారు. ఈ పరిణామాలు నందమూరి ఫ్యామిలీలో ప్రకంపనలు రేపుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ బాలయ్య, ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఆ పేరు ఎవరు పెట్టారు? దీని వెనుక ఏం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరేంటి? అనే విషయాలు చర్చిద్దాము. ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ మొదటి నుండి దూరం పెడుతుంది. ఈ క్రమంలో అలాంటి వాళ్లకు హరికృష్ణ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో నాన్నకు ప్రేమతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన హరికృష్ణ సంచలన కామెంట్స్ చేశారు.
హరికృష్ణ మాట్లాడుతూ… నాన్న గారు తన ఏడుగురు కొడుకులకు కృష్ణ అని వచ్చేలా పేర్లు పెట్టారు. నాకు ముగ్గురు కొడుకులు. పెద్దబ్బాయి జానకి రామ్, రెండో అబ్బాయికి కళ్యాణ్ రామ్ అని పెట్టాను. మూడో వాడు ఎన్టీఆర్ కి తారక్ రామ్ అని పెట్టాను. ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ ని నాన్నగారు(ఎన్టీఆర్) చూడాలన్నారు. నేను తీసుకెళ్ళాను. క్రింది నుండి మీదకు చూసి వెరీ గుడ్ బాగున్నాడు. ఏం పేరు అని అడగ్గా… తారక్ రామ్ అని సమాధానం చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.
కాదు వీడు నా అంశ. అందుకే నా పేరు పెట్టు. నేటి నుండి తారక్ రామ్ పేరు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి మా నాన్న ఎన్టీఆర్ స్వయంగా ఆయన పేరు ఇచ్చారు. నా అంశ అన్నాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడిగా ఎన్టీఆర్ చిన్నతనంలోనే ప్రకటించారని ఆయన పరోక్షంగా చెప్పారు. ఎన్టీఆర్ పేరు జూనియర్ ఎన్టీఆర్ సొంతం అని చెప్పకనే చెప్పాడు. హరికృష్ణ అప్పుడు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.