https://oktelugu.com/

Vithika Sheru: మా అమ్మ ముందే కమిట్మెంట్ అడిగాడు… హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితిక సంచలన ఆరోపణలు!

కెరీర్ బిగినింగ్ లో ఆఫర్స్ కోసం వెళితే ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు వితిక పంచుకుంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి .. ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ పెడితే చాలు అవకాశాలు వస్తున్నాయి

Written By: , Updated On : May 4, 2024 / 12:41 PM IST
Vithika Sheru sensational allegations

Vithika Sheru sensational allegations

Follow us on

వితికా షేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో వితిక షేరు హీరోయిన్ గా నటించింది. కన్నడ చిత్రం ‘అంతు ఇంతు ప్రీతీ బంతు’ తో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 21 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలో అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 2021లో విడుదలైన పెళ్లి సందడి చిత్రంలో ఓ పాత్ర చేసింది.

కాగా కెరీర్ బిగినింగ్ లో ఆఫర్స్ కోసం వెళితే ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు వితిక పంచుకుంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి .. ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ పెడితే చాలు అవకాశాలు వస్తున్నాయి అని ఆమె అన్నారు. నా పేరు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో నన్ను నార్త్ అమ్మాయి అనుకోని ఆడిషన్స్ కి పిలిచేవారు.

కానీ , అక్కడికి వెళ్లిన తర్వాత తెలుగు అమ్మాయివేనా అని చులకనగా చూసే వారు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్ళాను. ఆ ప్రాజెక్టు కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం వరకు నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్స్ కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో ఒత్తిడి ఉంటుందని చెప్పారట.

కమిట్మెంట్ అంటున్నారు ఏంటో తెలియడం లేదు మాట్లాడు అని అమ్మ నాతో చెప్పింది. వారి ప్రపోజల్ కి నో చెప్పాను. సార్ .. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కమిట్మెంట్ కి మాత్రం ఒప్పుకోను అని చెప్పాను. చిన్న వయసులోనే అలాంటి పరిణామం నాకు ఎదురైంది. మాకు బాగా తెలిసిన వాళ్లే నన్ను కమిట్మెంట్ అడిగారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టం అని సినిమాలకు దూరం అయ్యాను, అన్నారు.