Varun Lavanya Marriage: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ దేశంలో కొలువు తీరింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. నవంబర్ 1న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మూడు రోజులు ఘనంగా వివాహ వేడుకలు జరగనున్నాయి. సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నూతన దంపతులు సందడి చేశారు. వరుణ్ తేజ్ సిల్వర్ కలర్ టక్సేడో సూట్ ధరించారు. ఇక లావణ్య త్రిపాఠి సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించారు.
మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ సైతం టక్సేడో సూట్స్ లో అదరగొట్టారు. రేపు మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. పెళ్లి ముగిశాక నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఈ వేడుక పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.
వరుణ్ తేజ్ పెళ్లిలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం విశేషం. వరుణ్ తేజ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది నేషన్ అవుతుంది. కాగా వరుణ్, లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో విడుదలైన ‘మిస్టర్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. అంతరిక్షం చిత్రంలో మరోసారి జతకట్టారు.
లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు… మొదటి చూపులోనే ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడిందట. ఏళ్ల తరబడి వీళ్ళ ప్రేమ వ్యవహారం సాగింది. కేవలం రెండేళ్ల క్రితం వరుణ్-లావణ్య రిలేషన్ లో ఉన్నారని పుకార్లు లేచాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. సడన్ గా ఈ ఏడాది నిశ్చితార్థం ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ లో నాగబాబు నివాసంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు లావణ్య, వరుణ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
View this post on Instagram