https://oktelugu.com/

Varudu Kavalenu: నాగ శౌర్య “వరుడు కావలెను ” స్టోరీని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా ?

Varudu Kavalenu: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు యంగ్ హీరో నాగ శౌర్య.  వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు  లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 26, 2021 / 04:23 PM IST
    Follow us on

    Varudu Kavalenu: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు యంగ్ హీరో నాగ శౌర్య.  వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు  లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఇటీవల జరిగిన ఈ మూవీ సంగీత్ ఈవెంట్ కు బుట్టబొమ్మ ” పూజ హెగ్డే ” చీఫ్ గెస్ట్ గా వచ్చిన అసంగతి అందరికీ తెలిసిందే.

    అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నాగశౌర్య కంటే ముందు వేరే హీరోను అనుకున్నారట.  వరుడు కావలెను కథ శౌర్యకంటే ముందు నాగచైతన్య దగ్గరకు వెళ్లిందట. కానీ అప్పటికే నాగచైతన్య కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడంతో… శౌర్య ఈ స్టోరీని ఒకే చేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా రిఫ్రెషింగ్ స్టోరీల వైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయనే చెప్పాలి.

    ఇప్పటికే ఈ సినిమ్ అనుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభిస్తుంది. అలానే నాగశౌర్య, రీతూ వర్మ జంట కూడా  హైలైట్‌గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే సినిమాలు తెరకెక్కించే నాగశౌర్య…  మరోసారి ఈ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుగా రానున్నాడు. మరి ఈ మూవీ నాగ శౌర్య కు ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.