Varudu Kavalenu Movie: యంగ్ హీరో నాగ శౌర్య తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.

అందులో భాగంగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నామని చిత్రబృదం గతంలో తేదిని ప్రకటించింది. అయితే ఈ సినిమాను దసరాకు విడుదల చేయట్లేదని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని… U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
#VaruduKaavalenu is certified with U/A & coming to theatres with a bag full of joy & emotions on 29th Oct 😍 💫
Trailer out today at 07:00PM#VaruduKaavalenuFrom29thOct @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @NavinNooli @adityamusic pic.twitter.com/aPJMu9THqh
— Naga Shaurya (@IamNagashaurya) October 21, 2021
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. ఆర్చరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభించింది.