Varanasi Story Leaked: ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో నిలుస్తాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు… ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ని ఘనంగా నిర్వహించిన రాజమౌళి అంతే సక్సెస్ఫుల్గా ఈవెంట్ ని పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా టైటిల్ ని సైతం ‘వారణాసి’ అనే పేరును ఆఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక టైటిల్ లోనే కాకుండా సినిమాలో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయట. గ్లింప్స్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా టైం ట్రావెల్ కి సంబంధించిన మూవీ గా తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పృధ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నాడు. తను ఈ ప్రపంచాన్ని జయించాలని చూస్తాడు.
కానీ ఫిజికల్ గా హ్యాండీక్యాప్డ్ గా ఉండడంతో అతనికి నిలబడడానికి కూడా వీలుకాదు వీల్ చైర్ కి పరిమితమై పోతాడు. దాంతో హీరో రుద్ర దైవాంశ సంబుతుడిగా జన్మిస్తాడు. దానితో ఆయనను పట్టుకొని టైం ట్రావెల్ చేసి త్రేతా యుగంలో వెళ్ళి అక్కడ లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి ఎలా ఆయితే లక్ష్మణుడిని బతికించాడో మనందరికి తెలిసిందే…
అలాగే కుంభ కూడా హీరో ద్వారా సంజీవనిని దక్కించుకొని తను మామూలు మనిషి కావాలనుకుంటాడు. అందుకే హీరో విలన్ కలిసి టైం ట్రావెల్ చేస్తారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అనుకోని పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయాట. ఇక అదే సమయంలో మహేష్ బాబు రాముడు అవతారంలో మనకు 30 నిమిషాల పాటు కనిపించే సీన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి ఇదే కనక సినిమా స్టోరీ అయితే మాత్రం థియేటర్లు మొత్తం తగలబడిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కథ వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది రాజమౌళి దీనిని స్క్రీన్ మీద ఎంత గొప్పగా ఆవిష్కరిస్తాడో మనందరికి తెలిసిన విషయమే. ఒకవేళ సినిమా కనక కరెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే మాత్రం సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్ళిపోతోంది. ఈజీగా 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…