Rajamouli on Varanasi Shooting: మన టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి ఒక్కో సినిమాని ఎంత ఆలస్యం గా తీస్తాడో అందరికీ తెలిసిందే. రాజమౌళి తో సినిమా చెయ్యాలని ప్రతీ హీరో అభిమాని కి ఉంటుంది , కానీ అదే సమయం లో మా హీరో ని మరో మూడేళ్లు వెండితెర పై చూడలేము అని బాధ కూడా ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్దీ ఎలాంటి వారిలో అయినా మార్పు వస్తుందని అంటుంటారు పెద్దలు , అలా రాజమౌళి తీరులో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన , ‘వారణాసి’ లాంటి విజువల్ వండర్ ని కేవలం ఏడాది లోనే పూర్తి చేసే పరిస్థితి కి వచ్చారు. 2025 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం మొదలైంది. ఇప్పుడు 2026 సెకండ్ హాఫ్ కి వచ్చేశాం, షూటింగ్ కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో రీసెంట్ గా ఒక ప్రముఖ హాలీవుడ్ మాస పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఆయన మాట్లాడుతూ ‘సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశాము , ఇప్పుడు కేవలం సినిమాలోని కథకు ఇంటర్ లింక్ చేసే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే చేస్తున్నాము. మా ప్లానింగ్ ప్రకారం అయితే ఈ చిత్రం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చెయ్యాలని అనుకున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే అక్టోబర్ లో పూర్తి చేస్తాము , అంతకు మించి టైం పట్టదు’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సాధ్యమైత తొందరగా పూర్తి చేసి , ముందు ప్రకటించిన తేదీ ప్రకారమే ఏప్రిల్ 7 , 2027 న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ లెవెల్ లో అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోజున వారణాసి నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం ఉంది. కానీ రాజమౌళి మాత్రం రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో అసలు మహేష్ పుట్టినరోజున అప్డేట్ ఉంటుందా లేదా అనే అనుమానం ఫ్యాన్స్ లో బలంగా కలిగింది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
