Rajamouli Varanasi Movie: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో వస్తున్న కొన్ని రూమర్స్ ని చూసి అభిమానులు భయపడిపోతున్నారు. అవి కేవలం రూమర్స్ మాత్రమే కదా, పట్టించుకోవాల్సిన అవసరం లేదని పక్కకి వెళ్లిపోవాలా?, లేదా అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలా అనే సందిగ్దతలో పడిపోతున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఈమధ్య కాలం లో రూమర్స్ గా వినిపిస్తున్న అత్యధిక శాతం వార్తలు నిజం అయ్యాయి కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న భయంకరమైన రూమర్ ఏమిటంటే, డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli ) ‘వారణాసి'(Varanasi Movie) తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అని. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లిన రాజమౌళి, సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి?, అదెలా సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు.
అయితే రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చాడు. మహాభారతం తీస్తే రాజమౌళి నే తియ్యాలి, లేదంటే ఇండియా లో ఎవరి తరం కూడా కాదు అని మూవీ లవర్స్ బలంగా నమ్ముతుంటారు. ఈ మహాభారతం సిరీస్ తోనే రాజమౌళి తన కెరీర్ కి ముగింపు పలుకుతాడు అనే రూమర్ కూడా ఉంది. ‘వారణాసి’ చిత్రం పూర్తి అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని ఆయన చేయబోయేది ‘మహాభారతం’ అని అంటున్నారు. అయితే ఈ మహాభారతాన్ని కేవలం ఒక్క సినిమాతో వివరించి చెప్పలేము. కనీసం రెండు మూడు భాగాలు అయినా ఉండాలి. కానీ రాజమౌళి ‘మహాభారతం’ చిత్రాన్ని ఏకంగా 8 భాగాలుగా తెరకెక్కిస్తాడట. అంటే 8 సినిమాలు అన్నమాట. ఈ 8 చిత్రాలు తీయడానికి యావరేజ్ గా పదేళ్ల సమయం పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. కాబట్టి రాజమౌళి నిన్న మొన్నటి లాగా హీరో సెంట్రిక్ సినిమాలు ఇక చేయలేదని, అలా హీరో సెంట్రిక్ సినిమా గా చివరి చిత్రం ‘వారణాసి’ నే అవుతుందని అంటున్నారు.
అయితే ఈ మహాభారతం ని స్టార్ క్యాస్టింగ్ తో తీయడం అసాధ్యమైన పని కావొచ్చు. ఎందుకంటే స్టార్ హీరోలు అన్నేళ్లు కేవలం ఒక్క సినిమా కి కేటాయించడం ప్రాక్టికల్ గా కష్టమే. కాబట్టి రాజమౌళి ఈ ఎపిక్ ని కొత్త వాళ్ళతో తెరకెక్కిస్తాడేమో అని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్. కానీ అభిమానులు మాత్రం కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు ని, అర్జునుడి పాత్రలో రామ్ చరణ్ ని, కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని, భీముడి పాత్రలో ఎన్టీఆర్ ని ఊహించుకొని AI ద్వారా వీడియోలు కూడా క్రియేట్ చేసేస్తున్నారు. మరి రాజమౌళి కొత్తవాళ్లతో ఈ మెగా ప్రాజెక్ట్ ని తీస్తే, అభిమానుల రియాక్షన్ ఏంటో చూడాలి.