Varanasi Overseas Gross: తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ని ఇవ్వడమే కాకుండా, మన తెలుగు సినిమా స్థాయిని ఎవ్వరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్తున్న దర్శకుడు రాజమౌళి(SS Rajamouli). బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ లెవెల్ లో మన సత్తా చాటిన రాజమౌళి, ఆ తర్వాత #RRR తో ఏకంగా ఆస్కార్ అవార్డు ని అందుకున్నాడు. #RRR తర్వాత ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా మహేష్(Superstar Mahesh Babu) తో ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఇప్పటికే అతని విజన్ ని ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో ద్వారా చూపించాడు రాజమౌళి. ఈసారి కొడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మాత్రమే కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అవ్వాలి అనేదే రాజమౌళి టార్గెట్ అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. వెయ్యి కోట్ల టార్గెట్ ఇప్పుడు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో ప్రతిష్టాత్మకం అనేది తెలిసిందే.
వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే గొప్ప ఘనత గా ఫీల్ అవుతూ ఉంటారు మన మేకర్స్. కానీ ఈసారి రాజమౌళి టార్గెట్ ఏకంగా ఓవర్సీస్ నుండి వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టడమే అని తెలుస్తోంది. 8 ఏళ్ళ క్రితం వచ్చిన బాహుబలి 2 చిత్రం ఏకంగా 43 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను ఓవర్సీస్ నుండి రాబట్టింది. ఆ రోజుల్లోనే అంత వసూళ్లు అంటే, అలాంటి సినిమాని అందిస్తే, ఇప్పుడు బాహుబలి 2 కి మూడింతలు ఎక్కువ వసూళ్లు రావాలి కదా. అందుకే ఈసారి ఓవర్సీస్ కలెక్షన్స్ టార్గెట్ ఏకంగా 200 మిలియన్ డాలర్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి బలమైన కంటెంట్ సినిమాని అందిస్తే ఈ రేంజ్ గ్రాస్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు, ఆయనకు సాధ్యం కానిదంటూ ఏది లేదు కూడా. కాబట్టి చూడాలి ఆయన ‘వారణాసి’ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. రీసెంట్ గానే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసాడు. ఈ చిత్రం లో ఆయన మహేష్ బాబు కి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఈ చిత్రం లో మలయాళం హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన థీమ్ సాంగ్ ని విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా సంక్రాంతికి ఈ మూవీ నుండి మరో ఆసక్తికరమైన అప్డేట్ రాబోతుందని టాక్.