Varanasi Movie Story Leak: దర్శక ధీరుడు రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆయన చేసిన 12 సినిమాల్లో 12 మూవీస్ సూపర్ సక్సెస్ అయ్యాయి. 100% సక్సెస్ రేట్ కలిగిన ఏకైక దర్శకుడిగా చరిత్రని క్రియేట్ చేయడం అనేది అతనికే దక్కింది… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటివరకు ఈ సినిమా కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా విపరీతంగా కష్టపడుతున్నాడట. ఇక తన కష్టాన్ని చూడలేక వల్ల ఇంట్లో వాళ్ళు సైతం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రపంచ స్థాయి ప్రేక్షకుడిని మెప్పించాలి అంటే రాజమౌళి ఈ రేంజ్ లో కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే వారణాసి సినిమాకి సంబంధించిన స్టోరీ ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది…
హాలీవుడ్ కి చెందిన ఒక విఎఫ్ఎక్స్ సంస్థ వారణాసి సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలకు విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్ల తర్వాత ప్రాజెక్ట్ గా వారణాసి సినిమా పేరును మెన్షన్ చేస్తు దాని కింద ఈ సినిమాకు సంబంధించిన కొంత స్టోరీ రాసుకోవచ్చారు. దాంతో ఆ స్టోరీని చదివిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వారణాసి స్టోరీ ఇదే అంటూ దాన్ని వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అంటే రుద్ర (మహేష్ బాబు) అనే ఒక శివ భక్తుడు కాలానికి అతీతమైన ఒక శక్తి ఉందని దానికి సంబంధించిన ఒక ఆభరణాన్ని దక్కించుకోవడానికి చాలా అడ్వెంచర్లను చేస్తాడట.ఇక ఇలాంటి క్రమంలోనే తను ప్రాచీన విషయాలను సైతం వెలికితీస్తూ ఒకదానితో ఒకటి లింక్ చేసుకుంటూ తను ఎక్కడికి వెళ్తున్నాడు.
దానివల్ల ప్రపంచానికి ఉపయోగమేమిటి దుష్టులకు(కుంభ) ఇది దక్కితే దానివల్ల ప్రపంచం వినాశనం అయిపోయిందనే విషయాలను తెలుసుకొని వాళ్ల నుంచి దాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక జక్కన్న ఇలాంటి ఒక సూపర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఈ మూవీ సూపర్ సక్సెస్ ను సాధిస్తే 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…