Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి సినిమాకు ఆ మాత్రం లేకపోతే ఎలా , ఈ సినిమాకు కేవలం ఓటీటీ బిజినెస్ వెయ్యి కోట్ల రూపాయలకు జరుగుతుంది, కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టడం లో ఎలాంటి తప్పు లేదు లే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. అయితే ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు, కేవలం ఆ లుక్ కోసం, శ్రీ రాముడి హావభావాలతో నడవడం కోసం ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను అని మహేష్ బాబు చెప్పడం వంటివి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మనమంతా చూశాం.
అయితే సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ లో దాదాపుగా 25 నిమిషాల వరకు ఉంటుంది అట. ఆ 25 నిమిషాల షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులే అయ్యింది. రాజమౌళి ఈ సన్నివేశానికి సంబంధించిన VFX వర్క్ ని రీసెంట్ గానే అందుకున్నాడట. ఈ 25 నిమిషాల సన్నివేశం కోసం , VFX వర్క్ తో కలిపి దాదాపుగా 350 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యాయని అంటున్నారు. ఆ డబ్బు తో ఒక స్టార్ హీరోతో పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించొచ్చు. ఒక స్టార్ హీరో కి సినిమా మొత్తం అయ్యే బడ్జెట్ ని రాజమౌళి కేవలం ఒక 25 నిమిషాల సన్నివేశం కోసం ఖర్చు చేయించాడంటే, ఆ బ్లాక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. వెండితెర పై నిజంగానే శ్రీరాముడు దివి నుండి దిగి వచ్చాడా అని అనిపించేలా చేయడమే రాజమౌళి లక్ష్యం అట.
ఆ బ్లాక్ సరైన రీతిలో పేలితే మాత్రం, ఈ చిత్రం మొదటి వారం లోనే 2000 కోట్ల గ్రాస్ ని రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ సత్తా ఈ చిత్రానికి కచ్చితంగా ఉంది అనే చెప్పొచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వందల కోట్ల కలెక్షన్స్ ని చూస్తున్న రోజుల్లో, రాజమౌళి ‘బాహుబలి 2’ వేల కోట్ల గ్రాస్ క్లబ్ ని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇప్పుడు వేల కోట్ల ఇండియన్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ ని ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్లి ఆపుతాడో చూడాలి. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజే 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు , ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్ లో జనాలు ఈ సినిమా ని చూసేందుకు కదిలితే ఊహకందని కలెక్షన్స్ ని చూడొచ్చు.