Varanasi Movie Lakshmana Role: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉన్న అంచనాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కాబోతున్న ఈ సినిమాకు మహేష్ అభిమానులు ఇప్పటి నుండే క్రేజ్ పెంచేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అసలు ఈ సినిమా విడుదల అయ్యేది వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలోనా? , లేదా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రేంజ్ క్రేజ్ ఉంది ఈ చిత్రానికి. ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో లీకైన, అది తెగ వైరల్ గా మారిపోతూ వస్తోంది. రీసెంట్ గానే ఒక థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ రాముడి లుక్ లో ఉన్న స్టాండీ ఫోటో ని సోషల్ మీడియా లో ఎవరో అభిమాని అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయిపోయింది.
ఈ చిత్రం లో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో ఒక 25 నిమిషాల పాటు కనిపిస్తాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ఇదేనంటూ సోషల్ మీడియా లో ఒక ఫోటో తెగ వైరల్ గా మారింది. అయితే ఇది నిజమైన లుక్?, లేదా AI తో క్రియేట్ చేశారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ‘లక్ష్మణుడి’ పాత్ర అత్యంత కీలకం. రామాయణం లో లక్ష్మణుడి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ సినిమాలో రామాయణం మొత్తం చూపించరు కదా, కేవలం కొన్ని ఘట్టాలను మాత్రమే చూపిస్తారు. ఆ ఘట్టాలలోనే లక్ష్మణుడి పాత్ర అత్యంత కీలకం అట.
అందుకే ఈ పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అడివి శేష్ ని ఎంచుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసేశారు అట. హీరో గా మారిన తర్వాత అడివి శేష్ స్పెషల్ రోల్ చేయడం ఈ చిత్రానికే జరిగింది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ లో చిన్న క్యారెక్టర్ చేసాడు అడివి శేష్. చిన్న పాత్రే అయినప్పటికీ, బాగా గుర్తుండిపోయే పాత్ర. ఇందులో కూడా ఆయన పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ, ఆడియన్స్ బాగా గుర్తించుకునేలా ఉంటుందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కథ మొత్తం సంజీవని చుట్టూనే తిరుగుతుంది. లక్ష్మణుడు యుద్ధం లో మరణించిన తర్వాత ఆంజనేయ స్వామి సంజీవని వృక్షాలు ఉన్న పర్వతాన్ని మోసుకొస్తాడు. అనంతరం ఋషులు ఆ సంజీవని తో లక్ష్మణుడిని బ్రతికిస్తారు. ఈ చిత్రం లో కూడా విలన్ పృథ్వి రాజ్ కి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఆయన తిరిగి మామూలు మనిషిగా మాత్రమే కాదు, అమరుడిగా మారడానికి సంజీవని ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకొని , అది హీరో మాత్రమే తీసుకొని రాగలడు అనే విషయాన్ని గ్రహించి, ఆ తర్వాత చేసే ప్రయాణమే ఈ సినిమా కథ అట.