Varanasi Movie Making Video: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి ఏ చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం బాగా వైరల్ అయిపోతుంది . ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి తప్ప, మరో అప్డేట్ కనిపించదు. ఆ రేంజ్ డామినేషన్ తో దూసుకుపోతుంది వారణాసి చిత్రం. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది . పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగార్జున ‘కటింగ్ ఎడ్జ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ స్టూడియో ని ఏర్పాటు చేశాడు. ఇండియా లోనే ఇలాంటి టెక్నాలజీ ఉన్న స్టూడియో లేదు. ప్రస్తుతం రాజమౌళి తన ‘వారణాసి ‘ మూవీ షూటింగ్ ని ఇక్కడే చేస్తున్నాడు . భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అయ్యే సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు.
అందుకు సంబంధించిన ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత రాజమౌళి విజన్ కి దండేసి దండం పెట్టొచ్చు అనిపిస్తుంది. చిన్న సర్కిల్ లో నిలబడి ఫైటింగ్ చేస్తూ ఉంటారు, కానీ కెమెరా లో మాత్రం ఎడారి లో షూటింగ్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ని చాలా వరకు తగ్గించే విధంగా ఈ టెక్నాలజీ ఉండడం తో రాజమౌళి ఆకర్షితుడు అయ్యాడు . ఈ మేకింగ్ వీడియో లో రాజమౌళి తో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉండడం గమనార్హం . ఈ వీడియో లో మనం గాధలతో పోరాటం చేసుకోవడం వంటివి చూడొచ్చు. అంటే రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు అన్నమాట. కచ్చితంగా ఆడియన్స్ కి ఇది విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుందని అంటున్నారు మేకర్స్. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Also Read: KGF మేకర్స్ చేతుల్లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ ఫ్యాన్స్ కి పండగే ఇక!
ఇకపోతే ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ జార్జియా లో మొదలైంది. ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ నెల లోపు ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా చేసుకున్నారు. అంతే కాదు ఏప్రిల్ 7 న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కాబోతుండడం తో మేకర్స్ ప్రొమోషన్స్ కోసం ఆరు నెలల సమయం తీసుకోవాలని చూస్తున్నారట . అందుకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యిందని. ఆగస్టు నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చేస్తూనే ఉంటారని తెలుస్తోంది.