Varanasi movie vs Bahubali: ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు…ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళకు చిన్న చూపు ఉండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం పెరిగింది. మొత్తానికైతే ఇప్పుడు ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో నిలవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా రాజమౌళి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇండియాను దాటి ఆయన వరల్డ్ లెవెల్లో తన టాలెంట్ చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా ఈవెంట్ ను రీసెంట్ గా కండక్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపారు. మొత్తానికైతే ఈ ఈవెంట్ తో ఆయన చాలా వరకు సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి…
ఇక ఈ ఈవెంట్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కు సంబంధించిన అలాగే సినిమా కంటెంట్ ను తెలియజేస్తూ ఒక గ్లింప్స్ వదిలారు. ఆ గ్లింప్స్ అద్భుతంగా ఉన్నప్పటికి రాజమౌళి గతంలో చేసిన ‘బాహుబలి 2’ సినిమాలో ప్రభాస్ ఎద్దుల మీద ఎక్కుతున్న వీడియో వైరల్ చేస్తున్నారు. వారణాసి లో మహేష్ బాబు నంది మీద వచ్చిన వీడియోను ఇక బాహుబలి ఎద్దుల వీడియో ను పోల్చుతున్నారు.
ఈ రెండిటిలో బాహుబలి 2 లోని వీడియోనే బాగుందని చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ లుక్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నాయని, చాలా ఇంటెన్స్ తో ఉందని వారణాసిలో మహేష్ బాబు గ్లింప్స్ అంత ఎఫెక్టివ్ గా లేదని చాలామంది విమర్శలు చేస్తుండటం విశేషం… నిజానికి రాజమౌళి నుంచి మహేష్ బాబు లుక్కును అలాగే నంది మీద కూర్చొని వచ్చే వీడియోని వదిలిన తర్వాత చూస్తే అది గ్రాఫిక్స్ విషయంలో తేలిపోతోంది.
బాహుబలి సినిమాలో రాజమౌళి చూపించిన ఆ విజువల్ వండర్ ఇందులో కనిపించలేదనే చెప్పాలి. మరి సినిమా వచ్చే సమయానికి మళ్ళీ సిజి వర్క్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమా ముందు వారణాసి సినిమా పెద్దగా ఎఫెక్టుగా అనిపించబోదని చాలామంది ప్రభాస్ అభిమానులు సైతం కామెంట్లు చేస్తుండడం విశేషం…మరి వారణాసి సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా రోజులు వెయిట్ చేయాల్సిందే…
#Varanasi couldn’t match that BB2 vibe & the VFX feels a bit too obvious not really realistic. Overall impact feels reduced.#SSRajamouli #MaheshBabu #GlobeTrotter pic.twitter.com/GVjRrsGNpj
— The South Cinemaa (@southcinemaaaa) November 15, 2025