కరోనా మహమ్మరిని నివారణకు పలువురు సెలబెట్రీలు తమవంతు సహకారం అందుకున్నారు. కొందరు సెలబెట్రీలు కేంద, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తాజాగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో కరోనాపై స్పందించారు. 2011లో విడుదలైన ‘కాంటాజియన్’ మూవీ చేస్తే వైరస్ ఎలా విజృంభిస్తుందో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ ఈ మూవీని చూడాలని కోరారు.
కరోనా వైరస్ లాంటి కథాంశంతోనే 2011లో ‘కాంటాజియన్’ మూవీ విడుదలైంది. ఈ సినిమా నిండా ఇలాంటి వైరస్ సోకి ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఉంటుందని పేర్కొంది. ఈ మూవీ రిలీజ్ అయినపుడు పెద్దగా ఆడలేదని వరలక్ష్మి తెలిపింది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులకు ఈ మూవీకి కొంత అవినాభావ సంబంధం ఉండటంతో ప్రేక్షకులను ఈ మూవీని చూసేందుకే ఆసక్తి చూపుతున్నారని చెబుతుంది. ప్రస్తుతం ఈ మూవీ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతుందని తెలిపింది. ఈ మూవీ చూస్తే వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థమవుతుందని ఆమె పేర్కొంది.
కరోనా మహమ్మరి దేశంలో విజృంభిస్తున్నందున అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని వరలక్ష్మి సూచించింది. అందరూ సామాజిక దూరం పాటించాలని.. స్వీయనియంత్రణ పాటించాలని సూచించింది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరలక్ష్మి కోరింది.