Revanth Korukonda: వంశీ శేఖర్ పేరు వినగానే కొందరు సినిమా వాళ్ళు ముఖ్యంగా చిన్న చిత్రాల మేకర్స్ ఉలిక్కిపడుతున్నారు. చిన్న సినిమా వాళ్ళను ప్రమోషన్స్ పేరుతో వంశీ శేఖర్ అడ్డగోలుగా దోచుకుంటున్నా.. ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు. కానీ మొదటిసారి నాట్యం దర్శకుడు రేవంత్, పబ్లిక్ గా వంశీ శేఖర్ మోసాలు గురించి క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

రేవంత్(Revanth Korukonda) మాటల్లోనే.. ‘మా నాట్యం చిత్రానికి వంశీ, శేఖర్‌ను పీఆర్వోలుగా పెట్టుకొన్నాం. తొలుత ఉచితంగా పబ్లిసిటీ చేస్తామని వచ్చి.. ఆ తర్వాత మోసం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ప్రమోషన్ పేరుతో మా నుంచి డబ్బు పిండటం మొదలుపెట్టారు. అయితే మాకు అనుమానం రావడంతో మేమే స్వయంగా మీడియా వాళ్ళను కలుస్తామని చెప్పినా వాళ్ళు కుదరదు అన్నారు.
వాళ్ళ మాటలు విని సినిమాకి బాగా ప్రమోషన్ జరుగుతుందని మేము వారికీ భారీగా డబ్బులు అందజేశాం. అయితే వాళ్ళు మాత్రం పచ్చి మోసగాళ్లు. నేను గత మూడు సంవత్సరాలుగా నాట్యం సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అయితే, వంశీ, శేఖర్ మమ్మల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసి.. అందుకు కుదరకపోవడంతో మాతో గొడవ పడ్డారు.
పైగా మా సినిమా రిలీజ్ కు ముందే కొన్ని వెబ్‌సైటలో సినిమాకు, అలాగే మాకు వ్యతిరేకంగా రాయించారు. మా వద్ద డబ్బులు తీసుకొని మా కెరీర్లను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు అంటూ రేవంత్ ఆరోపించాడు. అలాగే వంశీ, శేఖర్ లాంటి వ్యక్తుల వల్ల చిన్న నిర్మాతలు, సినీ పరిశ్రమలోకి కొత్తగా రావాలనుకుంటున్న దర్శకులు చాలా నష్టపోతారు.
మాకు జరిగినట్టే.. గతంలో ఎందరికో జరిగింది అని మా దృష్టికి వచ్చింది. సినిమాను ప్రాణంగా ప్రేమించి వచ్చే వారికీ అన్యాయం జరుగుతుంది. వంశీ, శేఖర్ నిజస్వరూపం చెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటూ రేవంత్ విమర్శలు చేశాడు.