https://oktelugu.com/

చరణ్ తో మహేష్ డైరెక్టర్ ఫిక్స్.. కాకపోతే ?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ అంటూ మంచి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎట్టకేలకు తన తరువాత సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి నేమ్ ఉన్నా.. ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వలేదు. దాదాపు ఏడాదికి పైగా వంశీ అందరి స్టార్ హీరోల చుట్టూ తిరిగాడు. కానీ స్టార్స్ అంతా ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో, మొతానికి వంశీతో సినిమాకి […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 10:21 AM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ అంటూ మంచి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎట్టకేలకు తన తరువాత సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి నేమ్ ఉన్నా.. ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వలేదు. దాదాపు ఏడాదికి పైగా వంశీ అందరి స్టార్ హీరోల చుట్టూ తిరిగాడు. కానీ స్టార్స్ అంతా ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో, మొతానికి వంశీతో సినిమాకి ఎవ్వరూ ముందుకు రాలేదు. ముఖ్యంగా వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేశాడు.

    Also Read: అప్పటి ముచ్చట్లు : నీ మొహంలే.. అప్పుడు చూద్దాంగా !

    మహేష్ తో వంశీకి మంచి సాన్నిత్యం ఉన్నా.. మహేష్ మాత్రం వంశీతో సినిమా చేయడానికి మహేష్ ఇంట్రస్ట్ చూపించలేదు. దానికి మెయిన్ రీజన్ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడమే. దాంతో మహేష్, వంశీ సినిమాని పక్కన పెట్టేశారు. ఈ లోపు మహేష్ పరుశురాం కథకు ఫిక్స్ ఆయిపోయాడు మహేష్. అయితే, వంశీ తన కథ పట్టుకుని తిరిగి మొత్తానికి రామ్ చరణ్ ను ఒప్పించి సినిమా సెట్ చేసుకున్నాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ – దిలారాజు – దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో ఒక సినిమా ఫైనల్ అయింది. వంశీ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని అందుకే చరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

    Also Read: ప్రభాస్ తో పూజా రొమాంటిక్ గ్లింప్స్ !

    కాకపోతే, ఈ సినిమా ఇప్పట్లో ఉండదట. వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుందని.. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరి వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమా మలచాలనున్నారు. వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ ఎలాగూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ లోపు వంశీ స్క్రిప్ట్ వర్క్ మీదే కూర్చుంటాడట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్