‘ఆర్ఆర్ఆర్ – కేజీఎఫ్-2’ రిలీజ్ డేట్స్ లో ఒప్పందం !

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలంటే.. ముందుగా చెప్పుకునే సినిమాలు ‘ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్-2’ సినిమాలే. ముఖ్యంగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తుండటం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు […]

Written By: admin, Updated On : January 9, 2021 10:29 am
Follow us on


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలంటే.. ముందుగా చెప్పుకునే సినిమాలు ‘ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్-2’ సినిమాలే. ముఖ్యంగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తుండటం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: చరణ్ తో మహేష్ డైరెక్టర్ ఫిక్స్.. కాకపోతే ?

అలాగే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మరో సినిమా రాకింగ్ స్టార్ యశ్ – ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్-2. చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. అందుకే ఈ సినిమా సీక్వెల్ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ‘కేజీఎఫ్’ టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ మార్కును దాటేసి మొత్తానికి సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది అంటేనే.. ఈ సినిమా రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ చిత్రాలకు వివిధ భాషల్లో ఫుల్ క్రేజ్. నిజానికి ఈ రెండు సినిమాలూ గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాలి.

Also Read: చైతు కోసం పోటీలో పూజా – రష్మిక !

కానీ కరోనా అల్లకల్లోలంతో పాటు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి ఈ సినిమాలు. పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణ ఆలస్యం అయింది. దాంతో 2020 జులై 30 నుంచి 2021 జనవరి 8కి రిలీజ్ డేట్ ను మార్చగా.. కరోనా కారణంగా ఆ డేట్ ను కూడా అందుకోవడం సాధ్యం కాలేదు. ఇక ‘కేజీఎఫ్-2’ను గత ఏడాది దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకున్నా… కరోనా కారణంగా అది క్యాన్సల్ అయింది. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై చిత్ర బృందాలు ఒక అంచనాకు వచ్చాయట. ‘కేజీఎఫ్-2’ను సోలో రిలీజ్ గా జులై 30న ప్లాన్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ ను అక్టోబర్ లో విడుదల చేద్దామని అనుకుంటున్నారు. రెండు సినిమాలకి గ్యాప్ ఉండేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్