Homeఎంటర్టైన్మెంట్Vamsi Paidipally: దళపతి విజయ్ కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ తయారు చేస్తున్న వంశీ పైడిపల్లి... ఏంటంటే...

Vamsi Paidipally: దళపతి విజయ్ కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ తయారు చేస్తున్న వంశీ పైడిపల్లి… ఏంటంటే ?

Vamsi Paidipally: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. తనదైన నటనతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా  అభిమానులు సొంతం చేసుకున్నారు విజయ్. అయితే ఇటీవలే విడుదలైన ఆయన మాస్టర్ చిత్రంతో ఇంకాస్త తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్.  ఇప్పటి వరకు తన సినిమాల డబ్బింగ్ వెర్షన్స్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్… త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేయబోతున్నారని తెలిసిందే.

vamsi paidipally planning to do a different story with thalapathy vijay

అయితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌‌లో కనిపించబోతున్నాడట. అతనికి ఎరొటోమేనియా అనే మానసిక సమస్య ఉంటుందట. ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఒక రకమైన భ్రమలో ఉంటారు. తమ మనసుకు నచ్చిన వ్యక్తి తమని ప్రేమిస్తున్నట్టు అపోహ పడుతుంటారు. ఆ వ్యక్తికి తనెవరో తెలియకపోయినా, తనతో పరిచయం కూడా లేకపోయినా.. వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్టు, టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు ఫీలవుతారు. అలాంటి పాత్రలోనే విజయ్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు వివరించారట వంశీ పైడిపల్లి కానీ మహేష్ బాబు ఈ కథకి నో చెప్పారు అంట.

ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారు అని సమాచారం. ఈ మూవీ లో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారు, ఏ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు విషయాలను త్వరలో అధికారిక ప్రకటన రానున్నది. కాగా  స్క్రిప్ట్‌లో విజయ్ కొన్ని మార్పులు చెప్పాడని, ప్రస్తుతం అవి చేస్తున్నారని, అందుకే కాస్త టైమ్ పడుతోందని సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నారని టాక్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version