https://oktelugu.com/

మహేష్ తో మిడ్ నైట్ పార్టీ.. అందుకేనా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి బంధం మరీ విచిత్రంగా ఉంది. మహేష్ తనకు సినిమా చేయకుండా హ్యాండ్ ఇచ్చినా.. వంశీ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా, మహేష్ తో అదే స్నేహాన్ని అలా కొనసాగిస్తూ పోతున్నాడు. తాజాగా ఈ స్నేహితులు మళ్ళీ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకుంటున్న వీరి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నిన్న రాత్రి మహేష్ బాబు, మరికొంత మంది స్నేహితులు డిన్నర్ పార్టీలో […]

Written By:
  • admin
  • , Updated On : December 11, 2020 / 03:17 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి బంధం మరీ విచిత్రంగా ఉంది. మహేష్ తనకు సినిమా చేయకుండా హ్యాండ్ ఇచ్చినా.. వంశీ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా, మహేష్ తో అదే స్నేహాన్ని అలా కొనసాగిస్తూ పోతున్నాడు. తాజాగా ఈ స్నేహితులు మళ్ళీ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకుంటున్న వీరి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నిన్న రాత్రి మహేష్ బాబు, మరికొంత మంది స్నేహితులు డిన్నర్ పార్టీలో పాల్గొనగా.. అందులో వంశీ పైడిపల్లి కూడా ఉండటం విశేషం. ఆ ఫోటోని నమ్రత షేర్ చేశారు.

    Also Read: ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్

    ఈ ఫోటో చూశాకా మహేష్, పైడిపల్లి కాంబినేషన్ మళ్ళీ తెర పైకి వచ్చింది. నిజానికి “మహర్షి” సినిమా విడుదలైన వెంటనే పైడిపల్లి డైరెక్షన్లోనే మరో సినిమా చేస్తానని మహేష్ అందరి ముందు ప్రకటించి… స్క్రిప్ట్ మీద కూడా రెండు మూడు నెలలు కూర్చున్నాడు. కానీ వంశీ ఏడాది పాటు తన రైటర్ల టీంతో సిట్టింగ్ వేసి రాసిన కథ మహేష్ కు అస్సలు నచ్చలేదు. మొదట లైన్ కి మహేష్ ఓకే చెప్పినా.. ఆ తరువాత ఫుల్ స్క్రిప్ట్ విని.. వంశీకి సారీ చెప్పేశాడు. మరి పైడిపల్లి కథలో పస లేదని భావించిన మహేష్ పరుశురామ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    Also Read: డిసెంబర్ 31.. జబర్దస్త్ వర్సెస్ ఢీ..!

    దాంతో వంశీ ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కి మరో కథ చెప్పి ఫార్మల్ గా ఓకే చేయించుకుని.. తమ సినిమా అనౌన్సుమెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏది ఏమైనా తనకు హ్యాండ్ ఇచ్చినా మహేష్ తో మాత్రం తన బంధాన్ని వంశీ ఇంకా కొనసాగించడం వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఒకటి తెలుస్తోంది. మహేష్ తన తరువాత సినిమాని వంశీతో చేస్తానని మాట ఇచ్చాడట. అందుకే వంశీ ఇంకా మహేష్ చుట్టే తిరుగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్