Homeఎంటర్టైన్మెంట్Vamshi Paidipally: నిన్న విజయ్, ఇవాళ్ళ సల్మాన్ ఖాన్...వంశీ పైడిపల్లి ఇతర భాషల హీరోలతో మూవీస్...

Vamshi Paidipally: నిన్న విజయ్, ఇవాళ్ళ సల్మాన్ ఖాన్…వంశీ పైడిపల్లి ఇతర భాషల హీరోలతో మూవీస్ చేయడానికి కారణం ఇదే…

Vamshi Paidipally: ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుల హవా ఇండియా వైడ్ గా విస్తరించింది. మన వాళ్ళ డైరెక్షన్లో నటించడానికి చాలామంది ఇతర భాషల స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మన దర్శకులు మన హీరోలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణమేదైనా కూడా వాళ్లకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు సరిగ్గా లేకపోవడం, హీరోలు తమను పట్టించుకోకపోవడం లేదనే కారణం చేతనే వాళ్ళు ఇతర భాషలో హీరోలతో సినిమాలు చేస్తున్నారు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు గత రెండు సినిమాల నుంచి ఇతర భాషల హీరోల మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు.

2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వారసుడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయితే ఈ సినిమాలో విజయ్ తన నటనను అద్భుతంగా చేసినప్పటికి కథ అంత పర్ఫెక్ట్ గా లేకపోవడంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ ను హీరోగా పెట్టి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమానైతే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా ఇందులో భాగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సల్మాన్ ఖాన్ కి ఈ మధ్యకాలంలో అసలు సక్సెసులే లేవు. వంశీ పైడిపల్లికి సైతం గత సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదు. ఇక వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం మన దర్శకులు మన హీరోలతో సినిమాలు చేయకుండా ఇతర భాషల హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం కరెక్ట్ కాదు. వంశీ పైడిపల్లి మాత్రం కావాలనే ఇతర భాషల హీరోలను పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎందుకు అలాంటి సినిమాలు చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular