
వకీల్ సాబ్ మూవీ ప్రీరిలీజ్ వేడుక చాలా మందికి ఎసరు తెచ్చింది. ఇప్పటికే ఈ మూవీకి హాజరైన పవన్ కళ్యాన్ వ్యక్తిగత సిబ్బంది అందరికీ కరోనా సోకడంతో వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఇక పవన్ సైతం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు.
ఇక నిర్మాత దిల్ రాజు సైతం హోం క్వారంటైన్ లోకి వెళ్లాడు.ఈ ఉపద్రవం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ కు హాజరైన నిర్మాత బండ్ల గణేష్ సైతం రెండోసారి కరోనా బారినపడ్డారు.
ఇప్పటికే గత డిసెంబర్ లో బండ్ల గణేష్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అయితే తాజాగా వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకు హాజరైన మరుసటి రోజు నుంచి బండ్ల గణేష్ కు ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చిందట.. ఇప్పటికే కరోనా వచ్చిపోవడంతో ఆయన లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా తీవ్రత ఎక్కువ కావడంతో పరీక్షలు చేసుకున్నట్టు తెలిసింది.
కరోనాగా నిర్ధారణ కావడంతో వెంటనే బండ్లగణేష్ ఓ కార్పొరేటర్ ఆస్పత్రిలో చేరారట.. బెడ్స్ ఖాళీగా లేకుంటే చిరంజీవితో ఫోన్ చేయించి తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎలాంటి భయం లేదని వైద్యులు తెలిపారు.ఇలా వకీల్ సాబ్ ఫంక్షన్ కు హాజరైన చాలా మంది కరోనా బారినపడడం గమనార్హం.