మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించాడు పవర్ స్టార్. దీంతో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. అభిమానుల ఆనందానికైతే హద్దే లేకుండాపోయింది. కానీ.. ఓ చిన్న భయం. పవన్ రీ-ఎంట్రీ మూవీ కాబట్టి.. రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా వారిలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కన్నా ముందుగా అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. మరి, అక్కడ సినిమా చూసిన వారు ఏమంటున్నారు? ఎలాంటి టాక్ వస్తోంది అన్నది చూద్దాం.
పవన్ సినిమా అంటే.. సిల్వర్ స్క్రీన్ మొత్తాన్ని గ్రాబ్ చేసేస్తాడు పవర్ స్టార్. ఈ సినిమాలోనూ అదే జరిగిందని అంటున్నారు. వకీల్ సాబ్ గా పవన్ విశ్వరూపం ప్రదర్శించాడని అంటున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ నటన ఎవరెస్టుపై ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా కోర్టు సీన్లు దద్దరిల్లిపోయాయని చెబుతున్నారు. సినిమాను కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారని, పవర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటిగా మిగిలిపోతుందని, ఈ సినిమాతో పవర్ స్టార్ ను మూడేళ్లుగా ఎంత మిస్సయ్యామో అర్థమవుతోందని అంటున్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ కథను అద్భుతంగా తెరకెక్కించాడని, ఒరిజినల్ మూలం దెబ్బతినకుండా.. పవన్ ఎలివేషన్స్ కేక పెట్టించాడని పొగిడేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉందని, వేణు శ్రీరామ్ అద్భుతంగా మాయచేశాడని అంటున్నారు. ఇక, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడని చెబుతున్నారు. పాటలతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కేక పెట్టించాడని అంటున్నారు.
మొత్తంగా పవన్ కల్యాణ్ కు ఇంతకు మించి కమ్ బ్యాక్ మూవీ ఉండదని అంటున్నారు. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండాఫ్ దుమ్ములేసిపోయిందని అంటున్నారు. ప్రధానంగా కోర్టు సీన్లు సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయని అంటున్నారు. దీంతో.. సినిమా సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుందని, బొమ్మ బ్లాక్ బస్టర్ అయినట్టేనని చెబుతున్నారు.
ఇక, ఫ్యాన్స్ కైతే ఈ సినిమా ఫుల్ మీల్స్ వంటిదేనని అంటున్నారు. పవర్ స్టార్ మేనరిజం, యాటిట్యూడ్, డైలాగ్ అన్నీ కేకపెట్టిస్తాయని చెబుతున్నారు. మూడేళ్ల ఆకలిని ఈ సినిమా తీర్చేస్తుందని అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, ఇక మిగిలింది రికార్డుల విధ్వంసమేనని కూడా చెబుతున్నారు.
https://twitter.com/chandu_111115/status/1380298894962266115?s=20