https://oktelugu.com/

పవన్ బర్త్ డే ట్రీట్ రెడీ అవుతుంది..

మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఒకవైపు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరగగా.. పెళ్లి పనులు మొదయ్యాయి. మరోవైపు మెగాస్టార్‌‌ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరపడుతోంది. ఈ నెల 22న మెగాస్టార్‌‌ 65వ బర్త్డే. ఈ పుట్టిన రోజును ఓ రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో చిరు బర్త్‌డే కామన్ డీపీ హల్చల్ చేస్తోంది. బర్త్ డే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 08:26 PM IST
    Follow us on


    మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఒకవైపు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరగగా.. పెళ్లి పనులు మొదయ్యాయి. మరోవైపు మెగాస్టార్‌‌ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరపడుతోంది. ఈ నెల 22న మెగాస్టార్‌‌ 65వ బర్త్డే. ఈ పుట్టిన రోజును ఓ రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో చిరు బర్త్‌డే కామన్ డీపీ హల్చల్ చేస్తోంది. బర్త్ డే స్పెషల్గా మెగా ర్యాంప్ సాంగ్ ‘నమస్తే మాస్టరు’ రెడీ అయింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2వ తేదీన జరిగే పవర్‌‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 49వ బర్త్ డే వేడుకలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. పవన్ బర్త్డే కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)తో వరల్డ్ రికార్డు సృష్టించారు. పవన్‌ కళ్యాణ్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లోనే 65 మిలియన్ల ట్వీట్స్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తన కోసం ఇంత చేసిన ఫ్యాన్స్ కు బర్త్‌డే ట్రీట్ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

    Also Read: హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

    దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని బోనీ కపూర్ తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్కు బ్రేక్ పడడంతో ఈ వేసవిలో రిలీజ్ కావాల్సిన మూవీ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రెండేళ్ల విరామం తర్వాత పవన్ చేస్తున్న చిత్రం కాబట్టి ‘వకీల్‌ సాబ్‌’పై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, ఫస్ట్‌ సింగిల్.. మగువా మగువా (లిరికల్‌ వీడియో)కు విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే, ఈ మూవీలో కోర్టు సీన్ ఫొటో లీక్ కాగా.. అది కూడా వైరల్ గా మారింది. ‘వకీల్ సాబ్’ గురించి చాన్నాళ్లుగా అప్డేట్ లేకపోవడంతో పవన్‌ ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. అయితే, వారిని ఉత్సాహపరిచేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. పవన్‌ బర్త్డే రోజు అంటే సెప్టెంబర్ 2న ఈ మూవీ టీజర్‌‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పవన్ పుట్టిన రోజున అభిమానులకు గుర్తుండిపోయే రీతిలో టీజర్‌‌ను కట్ చేసే పనిలో ఉందట చిత్ర బృందం. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే.