
పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఏ హీరోకు ఉండని వీర అభిమానులు పవన్ కల్యాణ్ కు ఉంటారు. ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా సమయం తీసుకునే పవర్ స్టార్ సినిమాల కోసం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు వెయ్యికళ్లతో వేచిచూస్తుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తిరిగివచ్చి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రికార్డులు బద్దలు కొడతారని అభిమానులు అందరూ ఎదురుచూస్తూ వచ్చారు.
మొత్తానికి వారి కల శుక్రవారం నెరవేరిపోయింది. ఇప్పటికే పలుచోట్ల షోలు పడ్డాయి. రిపీడెడ్ గా ఫ్యాన్స్ సినిమాను మళ్లీ.. మళ్లీ చూస్తున్నారు. వకీల్ సాబ్ బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ అంటూ.. అందరూ ట్విట్ల మీద ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా విజయాన్ని వైరల్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. మొత్తానికి తమ బాస్ మరో భారీ విజయం సొంతం చేసుకున్నాడని అంటున్నారు.
వకీల్ సాబ్ గురించి అందరూ ఒకే మాట చెబుతున్నారు. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ అరాచకం.. సినిమా అదిరిపోయింది.. తమన్ ఇరగ్గొట్టేశాడు. డైలాగ్స్ పేలిపోయాయి. అంటూ అభిమానులు గల్లో తేలిపోతున్నారు. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించారంటూ.. కామెంట్లు పెడుతున్నారు. వకీల్ సాబ్ సినిమా కోసం బెనిఫిట్ ఫోలు, ప్రీమియర్ షోలు బాగానే పడ్డాయి. అయితే వీటికోసం అభిమానులే కాదు.. సెలబ్రెటీలు కూడా కాచుకుని కూర్చుకున్నారు.టాలివుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు బెనిపిట్ షో చూసేశారు. తాజాగా నాగబాబు సైతం ఉదయాన్నే సినిమా చూసేశారు.
నాగబాబు ఉదయం ఐదుగంటల ప్రాంతంలోనే వకీల్ సాబ్ సినిమా చూసేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పేరుపడే సీన్.. వకీల్ సాబ్ టైటిల్ షేర్ చేస్తూ… ఎదురుచూపులకు తెరపడింది.. అతడి మ్యానియా షురూ అయ్యిందని.. కామెంట్ చేశారు. ఇక వకీల్ సాబ్ గురించి అంతా ఒకే మాట చెబుతున్నారు. అసలైన సినిమా ఇదే.. అంటున్నారు. రికార్డుల కలెక్షన్లు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. ఓవర్సిస్ లోనూ మంచి ఓపెనింగ్ లు వచ్చాయి. కేవలం ప్రీమియర్ షోలోనే 200కే కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు బాహుబలి రికార్డులు బద్దలు కొడతారని అంటున్నారు.